Asianet News TeluguAsianet News Telugu

వకీల్ సాబ్ డైరెక్టర్ తో రామ్ చరణ్?


వకీల్ సాబ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ సెట్ అయినట్లు సమాచారం అందుతుంది. ఈ కాంబోలో మూవీ ఖాయమేనని టాలీవుడ్ వర్గాల బోగట్టా.. 
 

vakeel saab director venu sriram locked a movie with ram charan
Author
First Published Sep 9, 2022, 3:32 PM IST

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో RC 15 చేస్తున్నారు. భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభించిన శంకర్ ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భారతీయుడు 2 మూవీ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత శంకర్ రామ్ రామ్ చరణ్ మూవీ తిరిగి పట్టాలెక్కిస్తారు. కాగా రామ్ చరణ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మూవీ కమిట్ అయ్యాడు. ఇది ఓ స్పోర్ట్స్ డ్రామా అని కథనాలు వెలువడ్డాయి. అయితే మనసు మార్చుకున్న రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారట. 

గౌతమ్ తెరకెక్కించిన జెర్సీ హిందీ రీమేక్ డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో గౌతమ్ తో మూవీ రిస్క్ అని భావించిన చరణ్ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారట. ప్రభాస్ ఓన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ మూవీ నిర్మించాల్సి ఉంది. గౌతమ్ తో రామ్ చరణ్ మూవీ క్యాన్సిల్ చేసుకున్న తరుణంలో మరో దర్శకుడిని యూవీ క్రియేషన్స్ వాళ్ళు వెతుకుతున్నారట. ఈ క్రమంలో వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ హీరో రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ లాక్ చేశారు అంటున్నారు. 

మరి ఇదే నిజమైతే అంతకన్నా సంచలనం ఉండదు. దర్శకుడిగా వేణు శ్రీరామ్ గొప్ప టాక్ రెకార్డ్ కలిగిలేడు. ఎంసిఏ మాత్రం పర్వాలేదు అనిపించింది. కమర్షియల్ గా సక్సెస్ సాధించినప్పటికీ అదో గొప్ప చిత్రంగా చెప్పలేం. ఇక వకీల్ సాబ్ రీమేక్. పవన్ మేనియాతో ఆ మూవీ కొంత మేర ఆడింది. అది వేణు శ్రీరామ్ దర్శకత్వ ప్రతిభగా చెప్పలేం. కమ్ బ్యాక్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూశారు. 

కాగా దిల్ రాజు కాంపౌండ్ దర్శకుడైన వేణు శ్రీరామ్... అల్లు అర్జున్ తో ఐకాన్ టైటిల్ తో వకీల్ సాబ్ కి ముందే ప్రాజెక్ట్ ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. హీరో అల్లు అర్జున్ ఈ దర్శకుడిని లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో మూవీ సెట్ చేశాడని వార్తలు వస్తుండగా అందరూ విస్మయానికి గురవుతున్నారు. ఇందులో నిజా నిజాలు ఎంతో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios