హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వార్. సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. టైగర్, హృతిక్ ఇద్దరూ యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేసినట్లున్నారు. 

ఇక పొడుగు సుందరి వాణి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో వాణి కపూర్ తన అందాలన్నీ ఆరబోస్తోంది. భారీ ఖర్చుతో హృతిక్, వాణి కపూర్ పై దర్శకుడు ఓ సాంగ్ ని చిత్రీకరించారు. ఈ సాంగ్ కోసం వాణి కపూర్ మూడు నెలల పాటు పోల్ డ్యాన్స్, రింగ్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. 

వాణి కపూర్ కష్టానికి తగ్గ ఫలితం స్క్రీన్ పై వచ్చిందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సాంగ్ ప్రేక్షకులని మెప్పించడం ఖాయం అనే ధీమాలో చిత్ర సభ్యులు ఉన్నారు. తాజాగా ఆ సాంగ్ మేకింగ్ వీడియో డుదల చేశారు. 

పోల్ డాన్స్ లో వాణి కపూర్ శిక్షణ తీసుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇక వీడియో చివర్లో వాణి కపూర్ చాలా కష్టమైన పోల్ డాన్స్ చేస్తూనే అందాలు ఆరబోస్తున్న దృశ్యాలు చూపించారు.