Asianet News TeluguAsianet News Telugu

రైతుగా వివి వినాయిక్ , హీరోయిన్ ఎవరంటే...

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుంది. ఈ సినిమాలో వినాయక్‌ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే తాతగా,మనవడుగా ఈ సినిమాలో వినాయిక్ డ్యూయిల్ రోల్ లో కనిపిస్తాడంటున్నారు.  

v v vinayak character in his hero debut film
Author
Hyderabad, First Published Sep 19, 2019, 10:54 AM IST

 

మాస్ డైరక్టర్ వివి  వినాయక్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. గతంలో ఠాగూర్‌లో చిన్న పాత్రలో కనిపించిన వినాయక్‌ పూర్తి స్థాయి నటుడిగా ఇంతవరకు కనిపించలేదు. అయితే దర్శకుడు నరసింహరావు వినాయక్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం లో వినాయిక్ చేయబోయే పాత్ర ఏమిటనే విషయం చర్చనీయాంశంగా మారింది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుంది. ఈ సినిమాలో వినాయక్‌ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే తాతగా,మనవడుగా ఈ సినిమాలో వినాయిక్ డ్యూయిల్ రోల్ లో కనిపిస్తాడంటున్నారు.  ఈ సినిమాని వినాయక్‌ పుట్టినరోజు అయిన అక్టోబర్‌ 9న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టానున్నారు. ఆ రోజు నుంచే  రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. 10 వతేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట.  ఇక ఈ సినిమాలో చేయబోతున్న పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్నారు. జిమ్ లో కష్టపడుతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి శ్రియ నటిస్తుందని సమాచారం . దీనిని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది . గతంలో వినాయక్ దర్శకత్వంలో శ్రియ చెన్నకేశవరెడ్డి ,ఠాగూర్ సినిమాల్లో నటించింది.

2018లో వచ్చిన ఇంటిలిజెంట్‌ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌  హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో దర్శకుడిగా ఫామ్‌ కోల్పోయిన వినాయక్‌కు ఈ చిత్రం ఏ మేరకు కలిసి వస్తుందో అని ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios