ఇటీవల వస్తున్న వచ్చేస్తున్న సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్, తాజాగా ఆ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. నివేదా, సుధీర్ బాబులపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సాంగ్ ను శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేదిలు ఆలపించారు.
నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం `వి`. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు బిగ్ మూవీ కావటంతో విపై భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్‌లో చేస్తున్నారు చిత్రయూనిట్. వరుస ఇంటర్వ్యూలతో పాటు సాంగ్, మేకింగ్ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఇటీవల వస్తున్న వచ్చేస్తున్న సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్, తాజాగా ఆ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. నివేదా, సుధీర్ బాబులపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సాంగ్ ను శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేదిలు ఆలపించారు.
మోహన కృష్ణ ఇంద్రగంటి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ తెలుగు థ్రిల్లర్ లో `నేచురల్ స్టార్` నాని సైకో కిల్లర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇండియాతో పాటు దాదాపు 200 దేశాల్లో సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఎన్నో సినిమాలు, షోస్, స్టాండ్ అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, ప్రైమ్ మ్యూజిక్ ఎలా ఎంతో ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను అందిస్తోంది అమెజాన్ ప్రైమ్. అలాంటి ఓ ప్లాట్‌ఫాం ద్వారా తమ సినిమా రిలీజ్ అవ్వటం ఆనందంగా ఉందంటున్నారు వి చిత్రయూనిట్.

