Asianet News TeluguAsianet News Telugu

లీక్ : ఆ సెన్సేషనల్‌ కేసు ఆధారంగానే ‘వి’?

ఈ సినిమాలో నాని వరసపెట్టి మర్డర్స్ చేస్తూంటారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు, ఇన్ఫూలియన్సెడ్ పర్శన్స్, పొలిటీషన్స్ ..వాళ్లూ వీళ్లు అని ఉండదు. అందుకు కారణం అతనో సైకో అని, సైకో లు తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనేది ఉంటుందని పోలీస్ లు అంచనా వేసి ఇన్విస్టిగేట్ చేస్తూంటారు. అయితే అతను అదితి రావు హైదరీ మర్డర్ కు రివేంజ్ తీర్చుకుంటున్నారని తెలుస్తోంది. 

V Based On Ayesha Meera Murder Case!
Author
Hyderabad, First Published Sep 3, 2020, 12:31 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నేచుర‌ల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’.  సుధీర్ బాబు, అదితిరావు హైద‌రిల‌తో క‌లిసి నివేదా థామ‌స్ న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కాబోతోన్న విషయం తెలిసిందే. ముందుగా ‘వి’ అంటే ఏంట‌నేది చాలా మందిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. ‘వి’ అంటే విక్ట‌రీ అని కొందరు అంటున్నారు కానీ....కానీ ‘వి’ వెనుకున్న సీక్రెట్ ఏంటి అనేది ఓ చర్చగా మారింది. అది ప్రక్కన పెడితే ఈ చిత్రం కథ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా నిలిచిన ఓ కేసు ఆధారంగా రూపొందింది అని తెలుస్తోంది.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాని ప్రకారం ఈ సినిమాలో నాని వరసపెట్టి మర్డర్స్ చేస్తూంటారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు, ఇన్ఫూలియన్సెడ్ పర్శన్స్, పొలిటీషన్స్ ..వాళ్లూ వీళ్లు అని ఉండదు. అందుకు కారణం అతనో సైకో అని, సైకో లు తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనేది ఉంటుందని పోలీస్ లు అంచనా వేసి ఇన్విస్టిగేట్ చేస్తూంటారు. అయితే అతను అదితి రావు హైదరీ మర్డర్ కు రివేంజ్ తీర్చుకుంటున్నారని తెలుస్తోంది.

అదితి రావు హైదరీ మర్డర్ కేసుకు ఆధారం ఆయేషా మీరా హత్య కేసు అని తెలుస్తోంది. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో దోషి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన అనుమానితుడు సత్యం బాబు సైతం నిర్దోషిగా బయటపడ్డాడు. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో.. తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్‌గా మారింది. దీంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీనికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. వీటిన్నటినీ డ్రమటిక్ గా కథ గా అల్లుకుని ఓ ప్లాష్ బ్యాక్ గా వస్తుందని అంటున్నారు. ఆమె హత్యకు పగ తీర్చుకునే వ్యక్తిగా నాని కనిపిస్తాడంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ నిజం అనే విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

నాని  ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా సుధీర్‌ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుని రిలీజ్ కు సిద్దంగా ఉంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios