Asianet News TeluguAsianet News Telugu

'ఉయ్యాలవాడ' ముని మనమరాలి వివాహం! (వీడియో)

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనం గురించి నేటి తరానికి అవగాహన లేదు. కానీ ఆ వ్యక్తి జీవిత కథతో మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్నారని తెలియగానే ప్రతి ఒక్కరూ ఉయ్యాలవాడ గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు

uyyalavada narasimhareddy grand daughters marriage
Author
Hyderabad, First Published Aug 21, 2018, 5:59 PM IST

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనం గురించి నేటి తరానికి అవగాహన లేదు. కానీ ఆ వ్యక్తి జీవిత కథతో మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్నారని తెలియగానే ప్రతి ఒక్కరూ ఉయ్యాలవాడ గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సిపాయి ల తిరుగుబాటు కంటే ముందు బ్రిటిష్ సామ్రాజ్యా వాదుల శక్తులను గజగజ లాడించిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు వారి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ చరణ్ 'సై రా' సినిమాను నిర్మిస్తున్నారు.

మెగా స్టార్ చిరంజీవి ఈ చిత్రం లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అలరించనున్నారు. ఉయ్యాలవాడ ముని మనుమరాలు సంజనరెడ్డి వివాహం చెన్నై నగరానికి చెందిన ప్రతాప్ రెడ్డితో హైదరాబాద్ .జె.ఆర్.సి.కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు సంజనరెడ్డి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి, సుచరితలు ఆహ్వానితులకు స్వాగతం పలికారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, దక్షిణభారత ఉయ్యాలవాడ సేవసేన కన్వీనర్-సినీ నిర్మాత దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు

ఈ అంగరంగ వైభవంగా జరిగిన వివాహా కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు .ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి శ్రీ అఖిలప్రియ, పార్లమెంట్ సభ్యుడు జె.సి.దివాకరరెడ్డి, శాసనసభ్యులు సూర్యనారాయణ, బి.సి.జనార్ధనరెడ్డి,  రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ రఘువీరారెడ్డిలతో పాటు వై.స్.ఆర్.సి.పి.కి చెందిన విశ్వేశ్వరరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ,కాటసాని రాంభూపాల్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఉయ్యాలవాడ ముని మనవడు పెళ్లికుమార్తె తండ్రి "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను గతంలో మేమే చలనచిత్రం గా నిర్మించాలనుకొన్నాము. అప్పట్లో ఈ విషయమై సుమన్ ను, సాయికుమార్ ను కూడా సంప్రదించడం జరిగిందని.. ఉయ్యాలవాడ మెమోరియల్ గా మా ప్రాంతంలో తీర్చిద్దేందుకు ఇప్పటికే వారి విగ్రహం ను కూడా చేయించటం జరిగిందని, త్వరలో ఆ విగ్రహాప్రతిష్ట ,మెమోరియల్ హాల్, నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ జీవితాన్ని సినిమా గా తియ్యటం చాలా సంతోషం అని, ముఖ్యంగా వాడ.. వాడ ల తిరిగి తొలి స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని జాతీయ వీరుడుగా గుర్తించాలని అన్ని రాష్ట్రాలలో తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంను చేప్పట్టిన దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన ,కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ వివాహా మహోత్సవానికి విచ్చేసిన అతిరథమహారధులకు తన కృతజ్ఞతలను ఒక ప్రకటన లో తెలిపారు . 

                              "

Follow Us:
Download App:
  • android
  • ios