Asianet News TeluguAsianet News Telugu

శ్రీరాముడు UV క్రియేషన్స్ అప్పులు తీర్చి ఒడ్డున పడేసాడు

 రిలీజ్ అయ్యాక వచ్చే లాభాలు సంగతి ప్రక్కన పెడితే ఈ సినిమా పేరు చెప్పి యువి క్రియేషన్స్ మాత్రం ఒడ్డున పడింది. రాముడు యువి క్రియేషన్స్ ని ఆదుకున్నాడు అంటున్నారు.  

UV Creations bail out with Adipurush money
Author
First Published May 30, 2023, 3:48 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’.అద్వితీయమైన రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ ఎక్సపెక్టేషన్స్ ను అమాంతం పెంచేసింది. జూన్‌ 16న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. తాజాగా ‘జై శ్రీరామ్’ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాట అద్భుతంగా ఉంది.  ఈ నేపధ్యంలో  ఈ సినిమా బిజినెస్ ఊపందుకుని,  ఓ రేంజ్ లో జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైన ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. భారీ రేట్లకే ఈ సినిమా రైట్స్ ని అమ్ముతున్నారు. దాంతో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితేనే రికవరీ , బ్రేక్ ఈవెన్ అవుతుందనేది నిజం. 

ఇక సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాలు సంగతి ప్రక్కన పెడితే ఈ సినిమా పేరు చెప్పి యువి క్రియేషన్స్ మాత్రం ఒడ్డున పడింది. రాముడు యువి క్రియేషన్స్ ని ఆదుకున్నాడు అంటున్నారు.  ఎందుకంటే ఆదిపురుష్‌ తెలుగు రాష్ట్రాల హక్కులు ప్రభాస్ కి ఇచ్చేశారు నిర్మాతలు. ఆయన ఆ రైట్స్ ని  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఇచ్చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన  185 కోట్ల మొత్తంలో యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ దాదాపు వందకోట్లు ఇచ్చారని తెలిసింది. తనతో చేసిన రాధేశ్యామ్ డిజాస్టర్ అవటంతో ఆ అప్పులను ఈ విధంగా ప్రభాస్ తీర్చాడనిసమాచారం. అలాగే  నిర్మాత దిల్ రాజుకి నలభై కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆ మొత్తానన్ని సింగల్ పేమెంట్ లో సెటిల్ చేసేశారని సమాచారం. అలాగే తమ సినిమాల మూలంగా నష్టపోయి తమ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న మరికొంతమందికి డబ్బులు ఇచ్చేసి,   యూవీ క్రియేషన్స్ ఒడ్డున పడిందని సమాచారం.

ఇక ఈ చిత్రం నైజాం రైట్స్ ను రూ. 80 కోట్లకు, ఈస్ట్ గోదావరి రైట్స్ ను రూ. 15 కోట్లకు, సీడెడ్ రైట్స్ ను రూ. 15 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది. జూన్ 6న తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అప్పటి నుంచి జూన్ 16 వరకు థియేటర్లన్నీ రాముడిగా ఉన్న ప్రభాస్ కటౌట్స్‌తో నిండిపోనున్నాయి. జూన్ నెల మొత్తంగా ఆదిపురుష్‌ సందడి ఉండనుంది. కానీ గత 90 రోజులుగా యూట్యూబ్‌లో ఆదిపురుష్‌దే హవా నడుస్తోంది. ఒక్క యూట్యూబ్ అనే కాదు.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా అన్నింటిలోను ఆదిపురుష్‌ ట్రెండింగ్‌లో ఉంటోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios