'శివ' సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉత్తేజ్. ఆ సినిమాలో అతడి పాత్రకి మంచి పేరు రావడంతో టాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ కమెడియన్ గా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కానీ అతడికి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఎన్ని సినిమాలు చేస్తున్నా.. స్టార్ హోదా అందుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. స్టార్ హీరోతో సినిమా చేసినా, పెద్ద డైరెక్టర్ తో తీసినా ఆ సినిమా హిట్ కావాలని, అలా రెండు మూడు హిట్లు వెంటవెంటనే పడాలని అన్నారు. అలా పడకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు.

వేణుమాధవ్ నటించిన 'దిల్', 'సింహాద్రి', 'ఆది' ఇలా వరుసగా హిట్లు పడడంతో అతడికి క్రేజ్ వచ్చిందని, దాంతో అవకాశాలు పెరగడం, నిలబడిపోవడం జరుగుతుంటుందని అన్నారు. తన విషయంలో అలా జరగలేదని 'చందమామ' సినిమా హిట్ వచ్చిన చాలా కాలానికి 'మహాత్మ'.. ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత 'టాక్సీవాలా' తో హిట్ అందుకున్నానని.. ఇలా ఇంత గ్యాప్ ఉంటే జనాలకు గుర్తుండమని అన్నారు.

మంచి పాత్రలు వెంటవెంటనే పడకపోవడం వలనే తనకు బ్రేక్ రాలేదని ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల విడుదలైన 'ఫలక్ నుమా దాస్' సినిమాలో ఉత్తేజ్ కీలకపాత్ర పోషించారు.