ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా.. రాబోతున్న మరో సినిమా ఉస్తాద్. చాలా కాలం తరువాత ఈ యంగ్ హీరో నుంచి సినిమా రాబోతోంది.  


కీరవాణి తనయుడు సింహా కోడూరి హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలం అవుతుంది. ఇప్పటికీ రెండు మూడు సినిమాలు చేసినా.. ఇతర హీరోలతో పోటీ పడే విధంగా మాత్రం సినిమాలు చేయడం లేదు. ఏదో తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నాడంటే. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా.. మత్తువదలరా' .. తెల్లవారితే గురువారం .. 'దొంగలున్నారు జాగ్రత్త లాంటి సినిమాలతో కాస్త గుర్తింపు అయితే వచ్చింది కాని.. హీరోగా తనను తాను నిరూపించుకునే టైమ్ మాత్రం రావడంలేదు శ్రీసింహాకు. ఏదో చేస్తున్నా అంటే చేస్తున్న అన్నట్టు సినిమాలు చేస్తున్నాడు శ్రీసింహ. 

 సింహా, కుర్ర హీరోలకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక శ్రీసింహ నటించిన తాజాసినిమా ఉస్తాద్ .. రిలీజ్ కు రెడీగా ఉంది. వారాహి బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాతో, ఫణిదీప్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు టీమ్. అంతే కాదు ప్లేస్ కూడా సెట్ చేశారు. అంతే కాదు చీఫ్ గెస్ట్ ను కూడా కన్ ఫార్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. 

హైదరాబాద్ - ఆర్కే సినీ ప్లెక్స్ లో రేపు బుధవారం (ఏప్రిల్ 12) ఉదయం 9:30 గంటలకు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. ఈకార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో.. రానా రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగా టీజర్ ను లాంచ్ చేయించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా కోడూరి జోడీగా ఈ సినిమాలో కావ్య కల్యాణ్ రామ్ కనిపించనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.