పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ మూవీ ఎడిటింగ్ వర్క్ ని స్టార్ట్ చేశారు. 

DID YOU
KNOW
?
పవన్‌ కళ్యాణ్‌ నిరాశ
పవన్‌ కళ్యాణ్‌ చివరగా `హరి హర వీరమల్లు`తో వచ్చారు. ఆయన నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. కానీ బాక్సాఫీసు వద్ద ఆదరణ పొందలేకపోయింది.

సెప్టెంబర్‌ 25న `ఓజీ`తో రాబోతున్న పవన్‌ కళ్యాణ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల `హరి హర వీరమల్లు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఓ రకంగా నిరాశ పరిచింది. మరోవైపు త్వరలోనే `ఓజీ`తో అలరించేందుకు వస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహించిన `ఓజీ` మూవీ వచ్చే నెల 25న విడుదల కాబోతుంది. ముంబాయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` రెడీ చేస్తోన్న హరీష్‌ శంకర్‌

ఇంతలోనే మరో సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు పవన్‌. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ ఇటీవల అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో జరిగింది. ఇందులో పవన్‌ కంటిన్యూగా వారం రోజులపాటు పాల్గొన్నారు. ఆయనపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే రెండు పాటలను షూట్‌ చేశారు. ఇందులో పబ్‌ డాన్స్ బాగా జోష్‌ నింపేలా ఉంది.

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఎడిటింగ్‌ వర్క్ స్టార్ట్

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. సినిమాకి ఎడిటర్‌ వర్క్ స్టార్ట్ చేశారట. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ అధికారికంగా వెల్లడించింది. ఓ వైపు షూటింగ్‌ చేస్తూనే, మరోవైపు ఎడిటింగ్‌ చేసేపనిలో టీమ్‌ బిజీగా ఉంది. అయితే పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన ఇంకా కొంత పార్ట్ పెండింగ్‌లో ఉందట. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉందట. ఇంకా వారం రోజులపాటు పవన్‌ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందని తెలుస్తోంది. ఆయన టైమ్‌ ఇస్తే ఆల్మోస్ట్ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుందని తెలుస్తుంది. మళ్లీ పవన్‌ ఎప్పుడు టైమ్‌ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన డేట్స్ ఇచ్చేదాన్ని బట్టి సినిమా షూటింగ్‌ ఆధారపడి ఉంటుంది. ఈలోపు మెయిన్‌ వర్క్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎడిటింగ్‌ని స్టార్ట్ చేసింది టీమ్‌.

బ్యాక్‌ టూ బ్యాక్‌ `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` రిలీజ్‌

అయితే పవన్‌ స్పీడ్‌, హరీష్‌ శంకర్‌ స్పీడ్‌ చూస్తుంటే ఈ మూవీని కూడా ఈ ఏడాదిలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 25న `ఓజీ` విడుదల కానుంది. అనుకున్నటైమ్‌కి పూర్తయితే ఏడాది ఎండింగ్‌లో `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`ని కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇందులో పవన్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Scroll to load tweet…