మాజీ మిస్ ఇండియా ఉషోషి సేన్‌ గుప్తా ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది ఆకతాయిలు అమానుషంగా ప్రవర్తించారు. ఏ మాత్రం ఆలోచించకుండా వేధిస్తూ కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. కోల్ కతా లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది. ఉషోషి సేన్‌ దుండగులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఆమెకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో క్లుప్తంగా పేర్కొన్నారు."రాత్రి 11 గంటల సమయంలో ఉబెర్ క్యాబ్ లో ఇంటికి వెళుతుండగా పలువురు ఆకతాయిలు తన కారును అడ్డుకొని డ్రైవర్ ను కొట్టారు. అప్పుడు వారిని అడ్డుకుంటూనే వీడియో తీసా. కంట్రోల్ చేయబోతుంటే అసహ్యంగా ప్రవర్తించారు. కొద్దీ సేపటికి మరో 15 మంది వారితో కలిశారు.  సమీప పోలీసులను ఆశ్రయిస్తే వారు తమ పరిదిలోకి రాదని వేరే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయమని చెప్పారు.  

మీరు ఇప్పుడు రాకుంటే డ్రైవర్ ను వారు చంపేస్తారని చెప్పగా కానిస్టేబుల్స్ వచ్చి వారిని చెదరగొట్టారు. ఆ తరువాత మళ్ళీ కారుని ఫాలో అయిన రౌడీలు ఇంటివరకు వచ్చి తీసిన వీడియోను డిలీట్ చేయాలనీ వేధించారు. కారుపై రాళ్లతో దాడి చేసి నా బ్యాగ్ లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే మా అమ్మ సోదరి సాయంతో పోలీస్ స్టేషన్ కి  వెళ్లి పిర్యాదు చేశాను" అని ఉషోషి సేన్‌ గుప్తా పేర్కొన్నారు. ఇక ఘటనకు పాల్పడిన వారిలో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఘటనపై స్పందించని పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెండ్ వేటు వేసినట్లు తెలుస్తోంది.