రిలీజయ్యి రెండు వారాలు అయినా సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో సందడిగా నెలకొంటొంది. బాలయ్య ని బోయపాటి చూపించిన నెక్స్ట్ లెవెల్ మాస్ ప్రెజెంటేషన్ లో తనకి తానే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేశారు.
బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబో అంటే.. మాస్ మసాలా అని లెజెండ్, సింహ మూవీస్ ప్రూవ్ చేసాయి. ఇప్పుడు అఖండ కూడా అది నిజమే అని మరోసారి నొక్కి చెప్పింది. రిలీజ్ కు ముందే అఖండ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందులోనూ బాలయ్య అఖండ లుక్, అఘోర లుక్స్ మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలయ్య బాడీ లాంవేజ్, భారీ డైలాగ్స్, అఖండ లో యాక్షన్ సన్నివేశాలు, విలన్ శ్రీకాంత్ మేకోవర్ అన్ని సినిమాకి హైలెట్స్ అనేలా ఉన్నాయి. డిసెంబర్ 2 న రిలీజ్ కి రెడీ అయిన అఖండ మూవీ కి ఓవర్ సీస్ లో అనూహ్య స్పందన వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యుఎస్, ఆస్ట్రేలియాల లో లెక్కకు మించి థియేటర్స్ లో రిలీజ్ అవడమే కాదు...దుమ్ము రేపుతోంది.
మొదటి రోజు నుంచి ఓవర్ సీస్ లో అఖండ బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే థియేటర్స్ లో ఫుల్ గా టికెట్స్ అమ్ముడుపోయాయి. బాలకృష్ణ గత సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు తో పోయిన డబ్బులు ఈ సినిమాతో రకవరి అయిపోయినట్లే. అఖండ మూవీ తో మేకర్స్ భారీ లాభాలు మూట గట్టుకుంది.
2021 సంవత్సరానికి సంబంధించి ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన చిత్రంగా నిలిచింది. వారంలో రూ. 10.08 కోట్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యూఎస్‌లో రూ.6.68 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.1.26 కోట్లు, యూకేలో రూ.0.72 కోట్లు, యురప్‌లో రూ.0.15 కోట్లు, గల్ఫ్‌లో రూ.0.80 కోట్లు, కెనడాలో రూ.0.25 కోట్లు, సింగపూర్‌లో రూ.0.13 కోట్లు, మలేషియాలో రూ.0.04 కోట్లు; సౌత్ ఆఫ్రికా, జాంబియా, టాంజానియా, జపాన్ కలపి రూ.0.05 కోట్లు వసూలు చేసింది.
రిలీజయ్యి రెండు వారాలు అయినా సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో సందడిగా నెలకొంటొంది. బాలయ్య ని బోయపాటి చూపించిన నెక్స్ట్ లెవెల్ మాస్ ప్రెజెంటేషన్ లో తనకి తానే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేశారు. రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. విలన్ పాత్రలో శ్రీకాంత్ అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా. థమన్ సంగీతం అందించారు.
