సమంత సినిమాలకు దూరం.. వాళ్లే కారణమా?

First Published 7, Jul 2018, 1:32 PM IST
USA based distributor spreading rumours on Samantha
Highlights

సమంతాతో సినిమా చేయాలనుకున్న ఒక అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఆమె డేట్స్ కోసం ప్రయత్నించాడు. కానీ ఆమె దానికి అంగీకరించకపోవడంతో కావాలనే నెగెటివ్ పబ్లిసిటీ వచ్చే విధంగా గాసిప్స్ పుట్టించాడని సమాచారం.

రీసెంట్ గా అక్కినేని సమంతా సినిమాల నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. 2019 నుండి ఆమె సినిమాలు చేయదని కొన్ని కథనాలను ప్రచురించాయి. ఆమె ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడిందని.. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు పూర్తి చేసి ఇక గుడ్ బై చెప్పేస్తుందని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న సమంతా సన్నిహితులు ఇందులో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెబుతున్నారు.

ప్రస్తుతం చేస్తోన్న సినిమాలే కాకుండా దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమా అలానే గిరీశయ్య అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో ఆమె నటించనుంది. భవిష్యత్తులో కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే సమంతాపై ఇటువంటి రూమర్స్ రావడానికి కారణం ఎవరని ఆరా తీయగా కొందరు అమెరికా డిస్ట్రిబ్యూటర్లు కావాలనే ఈ వార్తలను స్ప్రెడ్ చేయిస్తున్నారని తెలిసింది. 

సమంతాతో సినిమా చేయాలనుకున్న ఒక అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఆమె డేట్స్ కోసం ప్రయత్నించాడు. కానీ ఆమె దానికి అంగీకరించకపోవడంతో కావాలనే నెగెటివ్ పబ్లిసిటీ వచ్చే విధంగా గాసిప్స్  పుట్టించాడని సమాచారం. మొత్తానికి సమంతా సినిమాలకు దూరమవుతుందేమోనని బాధపడ్డ అభిమానులకు ఇది మంచి విషయమనే చెప్పాలి! 

loader