Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య,గోపీచంద్ చిత్రం నేపధ్యం ఇదే

 గోపీచంద్ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బిజీగా ఉన్నారు. 
 

USA Backdrop for Balayya, Gopichand malineni film
Author
Hyderabad, First Published Nov 11, 2021, 7:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

"డాన్ శీను", "బలుపు", "పండగ చేసుకో" వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక గోపీచంద్ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 

పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో గోపీచంద్ మలినేని, ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీ ప్రారంభోత్సవం నవంబర్ 13, ఉదయం 10:26 గంటలకు ఘనంగా జరగనుంది. బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  క్రాక్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని తదుపరి చిత్రం కావటంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సారి తన సినిమాకు ఏ నేపధ్యాన్ని తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుంది. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య గూగుల్ సీఈవో గా మరియు ఒక రైతుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నరట. అలాగే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అమెరికా అని సమాచారం. దాంతో అమెరికాలో ఈ చిత్రం షూట్ జరగనుంది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో యుఎస్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ అని పెట్టబోతున్నట్లు వినికిడి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారు.

 ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న  ఈ ఈసినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అఖండ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టనున్నారు నందమూరి బాలకృష్ణ.
 

Follow Us:
Download App:
  • android
  • ios