మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన చిత్రం ఉప్పెన‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రచన సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షోకు డివైడ్ టాక్ ని మూట కట్టుకుంది. అయితేనేం  ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్స్  పెద్ద హీరో సినిమాలను దాటేసి ఆశ్చర్యపరిచింది. మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్లు వసూలు చేసిందని టాక్. ఈ నేపధ్యంలో యుఎస్ కలెక్షన్స్   ఎంత అనేది చర్చనీయాంశంగా గా మారింది.  

 కరోనా గ్యాప్ తర్వాత యుఎస్‌లో అత్యధిక లొకేషన్లలో రిలీజైన సినిమా కావటంతో అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీకెండ్ లో 170k డాలర్లు వసూలు చేసింది. అయితే ఓ ప్రక్కన చలి, మరో ప్రక్కన కరోనా తో తెలుగు వాళ్లు బయిటకు రావటం లేదు. ఈ నేపధ్యంలో ఇవి పెద్ద మొత్తం కాకపోయినా మంచి కలెక్షనే అంటున్నారు. ఫుల్ రన్లో 2.5 లక్షల డాలర్ల వరకు ఈ సినిమా రాబట్టే అవకాశముందని అంఛనా.  

శుక్రవారం: $71K
శనివారం: $64K
ఆదివారం: $34k
మొత్తం వీకెండ్ గ్రాస్: $169K

టాక్ సంగతి మొదట్లో డివైడ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా కలెక్షన్ల సునామి దీన్ని సూపర్ హిట్ స్థాయిని దాటుతోందనేది ట్రేడ్ వర్గాల సమాచారం.ముఖ్యంగా టికెట్ రేట్ల పెంచటం ఉప్పెనకు చాలా ప్లస్ అయ్యింది. డెబ్యూ హీరోల్లో ఇప్పటిదాకా టాప్ లో ఉన్న అఖిల్, చిరుతలను దాటేసి ఉప్పెన ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పోటీగా ఇంకే చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం ఉప్పెన కు ప్లస్ అయ్యింది .   

 ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దాంతో ఉప్పెన సినిమా పై  మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకులందరు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు.