Asianet News TeluguAsianet News Telugu

‘లవ్‌ స్టోరీ’: అమెరికాలోనూ ఆల్ టైమ్ రికార్డ్

గత ఏడాది నుండి ఊరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది లో కరోనా వల్ల వాయిదా పడింది. ఈ ఏడాదిలో కూడా కరోనాకు భయపడి వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సినిమాను విడుదల చేయడం జరిగింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదల అయిన మొదటి పెద్ద సినిమా అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. 

US Premieres: Love Story sets a record in 2021
Author
Hyderabad, First Published Sep 25, 2021, 5:11 PM IST

కరోనా వల్ల పెద్ద సినిమాల విడుదల లేకుండా పోయింది. ముఖ్యంగా సెకండ్‌ వేవ్ తర్వాత పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. దాంతో అందరి దృష్టీ లవ్ స్టోరీ పై పడింది.ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఫిదా కాంబో అవ్వడం వల్ల కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలని కోరుకున్నారు. లవ్‌ స్టోరీ ట్రైలర్ విడుదల తర్వాత సినిమా రేంజ్ అమాంతం పెరిగింది.  గత ఏడాది నుండి ఊరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది లో కరోనా వల్ల వాయిదా పడింది. ఈ ఏడాదిలో కూడా కరోనాకు భయపడి వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సినిమాను విడుదల చేయడం జరిగింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదల అయిన మొదటి పెద్ద సినిమా అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. అందుకే వసూళ్లు ఎలా వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా చూశారు.

సినిమా వచ్చేసింది రివ్యూలు పాజిటివ్ గా ఉన్నాయి! భారీ అంచనాలను నిలబెట్టుకుంది లవ్ స్టోరీ. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా ఈరోజు విడుదలవ్వగా చిత్రంపై ఉన్న నమ్మకంతో ప్రజలు థియేటర్లకు తరలివచ్చారు. లవ్ స్టోరీ సినిమా చాలా చోట్ల భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది.

ముఖ్యంగా యూఎస్ లో లవ్ స్టోరీ చిత్రం ప్రీమియర్స్ పరంగా సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. 224 లొకేషన్స్ లో యూఎస్ లో ఈ చిత్రం $293K కలెక్షన్స్ ను రాబట్టగా యూఎస్, కెనడా కలుపుకుని $306K నమోదు చేసింది ఈ చిత్రం. దీంతో నార్త్ అమెరికాలో 2021లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా లవ్ స్టోరీ నిలిచింది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ $300K ఓపెనింగ్ ను నమోదు చేసిన విషయం తెల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రికార్డ్ ఫిగర్స్ ను రిజిస్టర్ చేస్తోంది. విశ్లేషకులు భావించినట్లుగానే ఈ సినిమా కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను ఈ సినిమా దక్కించుకుంది.

ఈ చిత్రంలో నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడు. అతడి నటన పీక్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. క్లైమాక్స్ లో చైతూ నటన మరింతగా ఆకట్టుకుంటుంది. నటుడిగా చైతూ చాలా అంటే చాలా పరిణతి సాధించాడని కితాబు ఇస్తున్నారు. తన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఇక ట్యాలెంట్ కు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన సాయి పల్లవి కి మౌనిక పాత్ర అద్బుతంగా సూట్ అయ్యింది. ఫిదా భానుమతి తర్వత మళ్లీ మౌనిక పేరుతో సాయి పల్లవిని జనాలు నెత్తిన పెట్టుకుంటున్నారు. పల్లెటూరు నుండి హైదరాబాద్‌ వచ్చే ఒక అమ్మాయిని కళ్లకు కట్టినట్లుగా సాయి పల్లవి చూపించి మెప్పించింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios