బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఇటీవల ఓ ఈవెంట్ కి హాజరయ్యారు. 

బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఇటీవల ఓ ఈవెంట్ కి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మాజీ మిస్ ఇండియా, నటి ఊర్వశి రౌతేలా కూడా హాజరైంది. బోనీకపూర్ తో కలిసి ఊర్వశి ఫోటోకి ఫోజులిచ్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఫోటోలు తీసుకున్న తరువాత బోనీ పక్కకి వెళ్లే సమయంలో ఊర్వశితో ఏదో మాట్లాడుతూ ఆమె వెనుక భాగాన్ని తట్టాడు. తాకరాని చోట ఊర్వశిని తాకడంతో ఈ వీడియో కాస్త వైరల్ అయిపోయింది. అయితే ఊర్వశి మాత్రం బోనీ తనను టచ్ చేయడాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

కానీ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బోనీపై మండిపడ్డారు. కూతురు వయసున్న అమ్మాయితో ఇలానే ప్రవర్తిస్తావా..? అంటూ విమర్శిస్తున్నారు. ఈ వీడియోపై స్పందించిన ఊర్వశి.. ఇదొక న్యూసా..? అంటూ వార్త ప్రచురించిన న్యూస్ పేపర్ పై మండిపడింది.

అమ్మాయిలను గౌరవించడం తెలియనప్పుడు దయచేసి విమెన్ లిబరేషన్ గురించి, గర్ల్ పవర్ గురించి మాట్లాడకండి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఊర్వశి ట్వీట్ చూసిన నెటిజన్లు అతడు నిన్ను తప్పుగా తాకినప్పటికీ నువ్వు వాయిస్ రైజ్ చేయడం లేదు.. ఇంత భయమెందుకు..? అంటూ ఆమెని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

View post on Instagram