పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర ప్రదేశ్ సీఎం అంటూ అభివర్ణించిన ఊర్వశి రౌతేలా.. ఇలా ఇరుక్కుపోయిందేంటి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. జోరున కురుస్తున్న వర్షాలని కూడా లెక్క చేయకుండా పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. జోరున కురుస్తున్న వర్షాలని కూడా లెక్క చేయకుండా పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కింది.
అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెలుగు వెర్షన్ ని మార్చేసారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, తనికెళ్ళ భరణి, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఊర్వశి హాజరైంది. మైడియర్ మార్కండేయ అనే సాంగ్ లో ఊర్వశి తన గ్లామర్ ప్రదర్శించింది.
అయితే తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారానికి కారణం అయింది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఊర్వశి బ్రో మూవీ గురించి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ఊర్వశి పెద్ద తప్పే చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనే సంగతి మరచిపోయి.. పవన్ ని సీఎం అంటూ అభివర్ణించింది.
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో బ్రో ది అవతార్ చిత్రంలో కలసి నటించడం చాలా సంతోషంగా ఉంది. బ్రో మూవీ రేపు రిలీజ్ అవుతోంది.. అందరం మళ్ళీ కలుద్దాం అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో కూడా ఉర్వశి రౌతేలాకి తెలియదా ? ఏపీ సీఎం జగన్ అనే విషయాన్ని ఆమె మరచిపోయిందా ? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత మాత్రమే.. ఆయన్ని సీఎం అని అభివర్ణిస్తూ ఎలా ట్వీట్ చేస్తుంది ? అని నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
ఊర్వశి రౌతేలా పొరపాటుగా అలా చేసిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. కనీసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఈ బాంబే బ్యూటీకి లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలని ఊర్వశి భావించి ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే వైసిపి ఫ్యాన్స్ మాత్రం.. ఈ ట్వీట్ ఇలాగే ఉంచు.. 2024లో మాట్లాడదాం అని అంటున్నారు. ఏది ఏమైనా ఊర్వశి రౌతేలా పవన్ ని ముఖ్యమంత్రి అని ఎందుకు భావించిందో ఆమె క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.