నిమా రిలీజైన సంగతి కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు. రీసెంట్ గా విడుదలైన ఉరి:ది సర్జికల్ స్ట్రైక్ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కు కొత్త పాఠాలు నేర్పుతోంది. ఆడదాని చెప్పిన వారు ముక్కున వేలేసుకునేలా హౌస్ ఫుల్ బోర్డులతో సినిమా థియేటర్స్ దర్శనమిస్తున్నాయి.
2016లో భారత సైనికులపై పాకిస్థాన్ సాయంతో జరిగిన యూరి ఘటనను ఏ భారతీయుడు మర్చిపోలేడు. అయితే దొంగదెబ్బ తీసిన పాక్ సన్నిహిత ఉగ్ర ముఖలను, వారి స్థావరాలను నేలమట్టం చేసిన ది సర్జికల్ స్ట్రైక్ కూడా ప్రతి ఇండియన్ కి తెలుసు. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా వస్తోంది అంటే మొదట అంచనాలు రేగినప్పటికీ నటీనటులు టెక్నీషియన్స్ కి గుర్తింపు లేకపోవడంతో ఆ సినిమాకు పెద్దగా బజ్ రాలేదు.
అసలు సినిమా రిలీజైన సంగతి కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు. రీసెంట్ గా విడుదలైన యూరి :ది సర్జికల్ స్ట్రైక్ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కు కొత్త పాఠాలు నేర్పుతోంది. ఆడదాని చెప్పిన వారు ముక్కున వేలేసుకునేలా హౌస్ ఫుల్ బోర్డులతో సినిమా థియేటర్స్ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమాకు మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. ఇప్పటికే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న ఉరి సినిమా 250 కోట్ల వరకు టోటల్ కలెక్షన్స్ అందుకోవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన విక్కీ కౌశల్ ఇంతకుముందు క్యారెక్టర్ రోల్స్ చేసినవాడు. ఇక యామి గౌతమ్ కి పెద్దగా సక్సెస్ లేదు. ఇక దర్శకుడు ఆదిత్యకు ఇదే మొదటి సినిమా. జనవరి 11న రిలీజైన ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేయగా మొదటి 10 రోజుల్లోనే పెట్టుబడి వచ్చేసింది. ప్రస్తుతం నిర్మాత లాభాల్లో ఉన్నాడు. మొదటివారం నామమాత్రంగా వచ్చిన కలెక్షన్స్ సెకండ్ వీక్ నుంచి ఊపందుకున్నాయి. మంచి సినిమాలకు ప్రమోషన్స్ కూడా అవసరం లేదని యూరి సినిమా చెప్పకనే చెప్పింది.
