Asianet News TeluguAsianet News Telugu

‘ఉప్పెన’ యుఎస్ ప్రీమియర్స్ లేటు...వెనక కారణం ఇదే

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి . ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదలవుతోంది.  ఈ సినిమాకు యుఎస్ ప్రీమియర్స్ బాగా లేటుగా పడ్డాయి. అందుకు కారణం ఏమిటి ..టాక్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకు ఈ లేటు షాకింగ్ మారింది. 

Uppena US Premieres  Start Late jsp
Author
Hyderabad, First Published Feb 12, 2021, 8:11 AM IST

సాధారణంగా యుఎస్ ప్రీమియర్స్ మనకన్నా ఏడెనిమిది గంటలు ముందే పడిపోతాయి. దాంతో టాక్ బయిటకు వచ్చేస్తోంది. ఆ టాక్ ఖచ్చితంగా ఇండియా రిలీజ్ ఓపినింగ్స్ పై ప్రభావం చూపిస్తోంది. కథ,మెయిన్ ట్విస్ట్ లు ముందే వెబ్ మీడియా ద్వారా తెలిసిపోవటం జరుగుతోంది. అలాగే హిట్ టాక్ వస్తే ఏ సమస్యా లేదు..అదే తేడా కొడితే ఇక్కడ ఓ రేంజిలో ఆ టాక్ స్ప్రెడ్ అయ్యిపోతోంది.  ఈ విషయం నిర్మాతలు  చాలా కాలంగా గమనిస్తున్నారు. కానీ యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడితో..ముందుగా ఈ సమస్యని ఊహించకుండా చేసుకున్న ఎగ్రిమెంట్స్ తో ఈ సమస్యను సాల్వ్ చేయలేకపోతున్నారు.

 అయితే ఈ రోజు రిలీజ్ అవుతున్న  ‘ఉప్పెన’ కు మాత్రం టాక్ ముందుగా రాకుండా జాగ్రత్తలు తీసుకోగలిగారు. ఈ సినిమా యుఎస్ ప్రీమియర్స్ ని హైదరాబాద్ లో మొదటి షో రిలీజ్ టైమ్ కు ఓ గంట ముందు మాత్రమే ఉండేలా ప్లాన్ చేసారు. అలాగే ఈ సినిమాకు బెనిఫిట్ షోలు కూడా లేవు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు టాక్ ఓ గంట ముందే బయిటకు వస్తుంది. అప్పటికి ఇక్కడా ఆల్రెడీ షో పడిపోయి సినిమా దాదాపు ఇంటర్వెల్ కు వచ్చేస్తుంది. ఇలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు నిర్మాతలు. 

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి . ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదలవుతోంది.  పవన్ కల్యాణ్  కి ఈ చిత్రం ట్రైలర్ ను, ప్రమోషనల్ కంటెంట్ ను  వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చూపించారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని చిత్ర టీమ్ ని  ప్రశంసించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రంలోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్ తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. వైష్ణవ్ ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా… హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు అని అర్థం అవుతోంది.

 మనకు పరిచయం ఉన్న జీవితాలను… అందులోని ఎమోషన్స్ ను… మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. వీటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ‘రంగస్థలం’, ‘దంగల్’ ‘లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతాయి. ‘ఉప్పెన’ కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకీ, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. ‘ఉప్పెన‘ ఘన విజయం సాధించాల”ని ఆకాంక్షించారు.

Follow Us:
Download App:
  • android
  • ios