వైష్ణవ్‌ తేజ్‌ క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. ఈ సినిమా కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మరో సినిమాకి కమిట్‌ అయ్యాడట వైష్ణవ్‌ తేజ. 

`ఉప్పెన` సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌ అయ్యాడు మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమాతోనే వందకోట్లు కలెక్ట్ చేసిన డెబ్యూ హీరోగా టాలీవుడ్‌ చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే ఆయన క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. ఈ సినిమా కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మరో సినిమాకి కమిట్‌ అయ్యాడట వైష్ణవ్‌ తేజ. 

`అర్జున్‌రెడ్డి` డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా అసిస్టెంట్‌ గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈయన గతంలో తమిళంలో `అర్జున్‌రెడ్డి` రీమేక్‌ని రూపొందించారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇందులో ముంబయి మోడల్‌ కేతికా శర్మని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తుంది. ఏప్రిల్‌ నుంచి ఈ సినిమా స్టార్ట్ కానుందట. ఇదిలా ఉంటే వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఓ నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.