Asianet News TeluguAsianet News Telugu

లీక్ టాక్: 'ఉప్పెన' ఇంటర్వెల్ బ్యాంగ్ అదే


మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ యంగ్ హీరో ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు. మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.    ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. 

Uppena Interval bang banking on bold scene jsp
Author
Hyderabad, First Published Feb 1, 2021, 8:22 PM IST

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఉప్పెన ఇంటర్వెల్ బ్యాంగ్ లో హీరోయిన్ కృతి శెట్టి బోల్డ్ గా కనపడుతుందిట. హీరో,హీరోయిన్స్ మధ్య జరిగే ఓ రొమాంటిక్ సీన్ తో ఇంటర్వెల్ పడుతుందని చెప్పుకుంటున్నారు. ఆ సీన్ సినిమాలో హైలెట్ కానుందిట. అలాగే ఈ సీన్ సినిమా కథని మలుపు తిప్పుతుందని, కథ టోన్ మారుస్తుందని చెప్తున్నారు. అప్పటిదాకా లవ్ స్టోరీగా నడిచిన కథ ఈ సీన్ తర్వాత వైలెంట్ గా మారుతుందని వినికిడి. చూడాలి మరి ఈ లీక్ టాక్ లో నిజమెంత అనేది. 
  
ఇక నిర్మాతలు ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందమైన ఈ ప్రేమ కథ ప్రేక్షకులను తప్పకుండ మెప్పిస్తుందని మంచి హిట్ అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 18 – 20 కోట్లు చేయాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే సినిమాకి పెట్టిన పెట్టుబడి వర్క్ అవుట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 

 మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ‘‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్‌ సేతుపతి - రాయమన్‌ అనే పాత్రలో విలన్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమా ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు. త్వరలో ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
   

Follow Us:
Download App:
  • android
  • ios