ఎగ్రిమెంట్ ట్విస్ట్ : 70 లక్షలు వెనక్కి ఇచ్చేస్తున్న ‘ఉప్పెన’ దర్శకుడు?
దర్శకుడు బుచ్చిబాబుకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. పెద్ద నిర్మాణ సంస్దలు ఈ దర్శకుడుకి అడ్వాన్స్ లు ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. అందుతున్న సమాచారం మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు...70 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం. అయితే ఇప్పుడు దానికి ట్విస్ట్ పడింది. అడ్వాన్స్ వెనక్కి ఇఛ్చేయాల్సిన పరిస్దితి ఏర్పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
‘ప్రేమ అనే మహాసముద్రంలో దూకేందుకు రెడీ అవ్వండి...’ అంటూ మైత్రీ సంస్థ రిలీజ్ కు సిద్దం చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రం ద్వారా బుచ్చిబాబు సానా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుంచే మంచి బజ్ తో ముందుకు వెళ్తోంది. అలాగే ఇందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్..’ పాటలు విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ నేపధ్యంలో దర్శకుడు బుచ్చిబాబుకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. పెద్ద నిర్మాణ సంస్దలు ఈ దర్శకుడుకి అడ్వాన్స్ లు ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. అందుతున్న సమాచారం మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు...70 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం. అయితే ఇప్పుడు దానికి ట్విస్ట్ పడింది. అడ్వాన్స్ వెనక్కి ఇఛ్చేయాల్సిన పరిస్దితి ఏర్పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
అందుకు కారణం ..మైత్రీ మూవిస్ తో బుచ్చిబాబుకు ఉన్న ఎగ్రిమెంట్ అని తెలుస్తోంది. మైత్రీలోనే రెండో సినిమా చేసేటట్లుగా ఎగ్రిమెంట్ బుచ్చిబాబు చేసారు. దాంతో సితార వారు తమకు రెండో సినిమా చేయమని అడగటంతో ..మూడో సినిమా అయితే చేయగలనని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఉప్పెన తర్వాత సినిమా అయితే తమ ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చి వెంటనే బిజినెస్ అవుతుందని భావించిన సితార వారు కుదరదని చెప్పినట్లు సమాచారం. అయితే రెండో సినిమా ఎగ్రిమెంట్ ప్రకారం మైత్రీ వారికే చేయాలి కాబట్టి తాను చేయలేనని బుచ్చిబాబు చెప్పారట. ఈ నేపధ్యంలో అడ్వాన్స్ వెనక్కి సితార వారు తీసేసికున్నట్లు చెప్తున్నారు.
పంజా వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇందులో విజయ్ సేతుపతి - రాయమన్ అనే పాత్రలో ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, థియేటర్లు తెరుచుకోగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.