Asianet News TeluguAsianet News Telugu

‘ఉప్పెన’ టీవీ లో సెకండ్ టైమ్..షాకింగ్ టీఆర్పీ


 ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉప్పెన’  సినిమా సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు బుల్లి తెరపైనా ఆ రికార్డ్ లు కంటిన్యూ చేస్తోంది.

Uppena continues to garner high TV viewership jsp
Author
Hyderabad, First Published Jun 25, 2021, 7:27 AM IST


 తమ సినిమాపై నమ్మకంతో లాక్ డౌన్ టైమ్ లో ఎన్ని ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కాదనుకుని,  తొమ్మిదినెలల పాటు వాయిదా వేసి.. థియేటర్స్ లో రిలీజైంది ‘ఉప్పెన’  సినిమా. ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకూ..  థియేటర్స్‌లో 50-50 ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. అయితే 100 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఉప్పెనకు కలిసొచ్చింది. ఇక ఫస్ట్ వీకెండ్ శని, ఆదివారంలతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ఉప్పెన చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చింది.  దాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నిర్మాతలు. అక్కడ కలెక్షన్స్ రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇప్పుడు బుల్లితెరపైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతోంది. నెల క్రితం మొదటి సారి ప్రసారం అయ్యినప్పుడు సూపర్ హిట్ టీఆర్పీ తెచ్చుకుంది. రీసెంట్ గా సెకండ్ టైమ్ టెలీకాస్ట్ అయ్యింది. అప్పుడూ టీఆర్పీ మూమూలుగా లేదు. 

ఉప్పెన బుల్లితెర మీద స్టార్ మా లో ఏప్రిల్18 ఆదివారం సాయంత్రం ప్రసారం చేసారు. ఇతర ఛానెల్స్ నుంచి పెద్ద సినిమాలతో ఎంత పోటీ ఉన్నా తట్టుకుని ఉప్పెన ప్రసారం అయిన స్టార్ మా  18.5 టీఆర్పీ తెచ్చుకుంది. థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద కుడా ఉప్పొంగిన ఉప్పెన గా ఉప్పెన సినిమా భారీ టీఆర్పీ తో రికార్డు సృష్టించిందన్నారు. ఇప్పుడు రెండో సారి అదే వరస. రీసెంట్ గా టెలీకాస్ట్ అయిన ఈ చిత్రం 11.37 రేటింగ్ తెచ్చుకుంది. ఇది అరుదైన రికార్డ్. దాంతో సినిమా జనం ఉప్పెన ఊపు చూసి షాక్ అవుతున్నారు. చాలా మంది ఈ సినిమా టీవీల్లో చూసే కంటెంట్ కాదన్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. 

బుచ్చిబాబు సన దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ను సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఇంత విజయం సాధించడానికి సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించింది అని చెప్పాలి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు.  థియేటర్స్ లో 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని నిర్మాతలకి కట్టబెట్టిన ఉప్పెన మూవీ బుల్లితెర మీద స్టార్ మా కి అదిరిపోయే టీఆర్పీ తెచ్చిపెడుతోందని గర్వంగా చెప్పుకుంటున్నారు.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios