Asianet News TeluguAsianet News Telugu

అసలు లెక్కలు: ‘ఉప్పెన’ 5 రోజుల కలెక్షన్స్ | (ఏరియావైజ్)


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.
 

Uppena 5 Days Worldwide Box Office Collections Shares jsp
Author
Hyderabad, First Published Feb 18, 2021, 9:16 AM IST

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.

మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన చిత్రం ఉప్పెన‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రచన సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షోకు డివైడ్ టాక్ ని మూట కట్టుకుంది. 

అయితేనేం  ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్స్  పెద్ద హీరో సినిమాలను దాటేసి ఆశ్చర్యపరిచింది. అయితే సోమవారం నుంచి ఈ కలెక్షన్స్ స్టడీగా ఉంటాయా..డ్రాప్ అవుతాయా అనేది ట్రేడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ లో కొద్దిపాటి డ్రాప్ కనిపించింది కానీ పెద్దగా లేదు.  ఈ నేపధ్యంలో ఐదు రోజుల కలెక్షన్స్ చూద్దాం.

ఏరియా                                                   షేర్  (కోట్లలో)

-------------------                 ---------------------------------------------

నైదాం                                           11.03

సీడెడ్                                         5.17

నెల్లూరు                                     1.14

కృష్ణా                                       2.20

గుంటూరు                                      2.65

వైజాగ్                                         5.59

వెస్ట్ గోదావరి                          3.23

ఈస్ట్ గోదావరి                        1.91

మొత్తం ఏపి,తెలంగాణా షేర్              32.92

కర్ణాటక                                   1.71

తమిళనాడు                                 0.65

భారత్ లో మిగతా ప్రాంతాలు                                                0.51

ఓవర్ సీస్                                       1.60

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా                       37.39

 టాక్ సంగతి మొదట్లో డివైడ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా కలెక్షన్ల సునామి దీన్ని సూపర్ హిట్ స్థాయిని దాటుతోందనేది ట్రేడ్ వర్గాల సమాచారం.ముఖ్యంగా టికెట్ రేట్ల పెంచటం ఉప్పెనకు చాలా ప్లస్ అయ్యింది. డెబ్యూ హీరోల్లో ఇప్పటిదాకా టాప్ లో ఉన్న అఖిల్, చిరుతలను దాటేసి ఉప్పెన ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పోటీగా ఇంకే చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం ఉప్పెన కు ప్లస్ అయ్యింది .   

 ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దాంతో ఉప్పెన సినిమా పై  మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకులందరు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios