సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రం అనీల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నిమిత్తం ఆల్రెడీ కాస్టింగ్ ఫైనలైజ్ చేయటం జరుగుతోంది. అందులో భాగంగా సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఉపేంద్రను సంప్రదిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఉపేంద్ర ఓకే చేసారా..అది నిజమేనా అనేది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఐలవ్యూ అనే చిత్రం ప్రచారం ఉపేంద్ర సిటీకి వచ్చారు. ఆయన్ను కలిసిన మీడియా ఈ విషయమై ప్రశ్నించింది. 

ఉపేంద్ర సమాధానమిస్తూ... మహేష్‌ సినిమా కోసం తనని సంప్రదించిన మాట వాస్తవమేనని చెప్పారు. , అయితే ఇప్పుడు తన డేట్లు ఖాళీ లేవని, అందుకే చేయలేనని చెప్పి సారీ అనేసానని ఉపేంద్ర మీడియాతో  అన్నారు. ఉపేంద్ర 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తర్వాత తెలుగులో అలాంటి సపోర్టింగ్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే భావనతో ఆయన్ని సంప్రదించటం జరిగింది. 

ఇక తను కన్నడలో సినిమాలు లేనపుడు, అద్బుతమైన పాత్ర  వచ్చినపుడు మాత్రమే తెలుగులో చేస్తానని, ఏది పడితే అది చేసేసి తెలుగు ప్రేక్షకులకి తనపై వున్న గౌరవాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోలేనని చెప్పాడు. 

ఇక మహేష్‌ బాబుతో కలిసి నటించాలని వున్నా కానీ వాళ్లు అడిగిన డేట్లు తనకు సెట్ కాలేదని అందుకే రిజెక్ట్‌ చేసానని అన్నారు. మరోసారి  అవకాశమొస్తే తప్పకుండా కలిసి నటించడానికి ప్రయత్నిస్తానని అన్నాడు.