మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ అందింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కు టైం ఫిక్స్ చేసిన మేకర్స్.. తాజాగా మరో వెర్షన్ ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్ చేస్తూ అప్డేట్ అందించారు.   

మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi,రామ్ చరణ్ Ram Charan తొలిసారి ఫుల్ లెన్త్ రోల్స్ లో కలిసి నటిస్తుండటంతో సినిమాపై ఆడియెన్స్, మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతుండటంతో అందరి చూపు ప్రస్తుతం ఆచార్య (Acharya) పైనే ఉంది. ఎనర్జిటిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి కలిసి కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమాలో చిరుకు జతగా కాజల్ Kajal Aggarwal, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే Pooja Hegde నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నారు. దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కుల భరతం పట్టే నక్సలైట్లుగా చిరు, చరణ్ కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ నిన్న థియేటర్ లో ట్రైలర్ లాంచ్ పై అప్డేట్ అందించారు. 5:49కి బిగ్ స్క్రీన్ పై ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కానున్నట్టు అనౌన్స్ చేశారు. తాజాగా ఆచార్య య్యూటూబ్ వెర్షన్ ట్రైలర్ కు కూడా టైం ఫిక్స్ చేశారు. థియేటర్లలో రిలీజ్ అయిన గంట తర్వాత ఇంటర్నెట్ లో రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. సాయంత్రం 7:02 నిమిషాలకు య్యూటూబ్ లో ఆచార్య ట్రైలర్ రిలీజ్ కానుంది. ఒకే రోజు అటు థియేటర్స్ లో.. ఇటు య్యూటూబ్ లో ట్రైలర్ లాంచ్ చేస్తుండటం పట్ల ఆడియెన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 

ఇప్పటికే ఆచార్య నుంచి వచ్చిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు ఇద్దరు మెగా హీరోలు రెబల్స్ గా కనిపించనుడటం పట్ల సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు రానున్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఇక చిరు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో ఉన్నారు. రామ్ చరణ్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘RC 15’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆచార్య మూవీ ఏప్రిల్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Scroll to load tweet…