మాస్ మహారాజా, హీరో రవితేజ (Ravi Teja) వరుస చిత్రాలతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు. చివరిగా ‘ఖిలాడీ’తో అలరించిన రవితేజ నటిస్తున్న మరో చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ అందింది.
తెలుగు ఆడియెన్స్ ను మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో అరిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్నారు. విరామం లేకుండా షూటింగ్ లలో పాల్గొంటూ త్వరగా పూర్తి చేస్తున్నారు. చివరిగా ‘ఖిలాడీ’ (Khiladi) మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Rama Rao On Duty), ‘రావణాసూర, ధమ్కీ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ లో బిజియేస్ట్ హీరోగా ఉన్నాడు.
అయితే, గతంలో ప్రకటించినట్టే దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ Tiger Nageswara Raoలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా భారీ చిత్రంగా రూపుదిద్దుకోనుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా, ఈ భారీ స్కేల్ నుంచి క్రేజీ అప్డేట్ అందింది. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అదేవిధంగా అదే రోజు సినిమాకు ముహూర్తం ఖరారు చేసినట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత చిత్ర రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. జూన్ 17న రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
