జూనియర్ ఆర్టిస్ట్ ని అత్యాచారం చేసిన కేసులో యువ హీరో పియాంత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కి తరలించడం జరిగింది.
యువ హీరో ప్రియాంత్ రావును జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ జూనియర్ ఆర్టిస్ట్ ప్రియాంత్ పై కేసు పెట్టారు. ఫిర్యాదులో ప్రియాంత్ మోసం చేశాడు. అంతేకాకుండా అత్యాచారానికి పాల్పాడ్డాడని, కులం పేరుతో దూషించాడంటూ ఆమె పేర్కొన్నారు. బాధితురాలి పిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియాంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.
బాధితురాలు కథనం మేరకు.... 'కొత్తగా మా ప్రయాణం' సినిమాలో హీరోగా నటించిన ప్రియాంత్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. రెండు నెలల స్నేహం అనంతరం ప్రియాంత్ ఆమెను ప్రేమిస్తున్నట్లు వెల్లడించాడు. ప్రియాంత్ ప్రేమను ఆమె అంగీకరించారు. చనువుగా ఉంటున్న తనపై ప్రియాంత్ అత్యాచారం కూడా చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె చెబుతున్నారు.
శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ఆఫీస్ కి పలుమార్లు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు,దాడికి గురి చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. దీంతో ఆమె గర్భవతి అయ్యారు. తాను గర్భవతి అయినప్పటి నుండి తనను అవైడ్ చేస్తున్నాడట. గర్భం పోవడానికి మెడిసిన్ వాడటంతో అనారోగ్యం బారిన పడ్డాడనని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు విన్నవించుకున్నారు.
