కూతురు క్లింకారతో సరదాగా ఆడుకుంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన కూతురును చూసి మురిసిపోతున్నాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని శేర్ చేసుకుంది..మెగా కోడలు ఉపాసన.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన గారాల పట్టి క్లింకారతో ఆడుకుంటున్న పిక్ ను శేర్ చేసింది.. ఉపాసన. తన సోషల్ మీడియా పేజ్ లో ఆమె శేర్ చేసిన ఈ పోటో క్రిస్మస్ వేడుకల సందర్భంగా తీసింది. అయితే ఈ ఫోటోలు రామ్ చరణ్ తన కూతురు తో ఆడుకుంటూ మురిసిపోతున్నాడు. ఈ సీన్ ను చూస్తూ.. తాను కూడా మురిసిపోతోంది ఉపాసన. ఈ అరుదైన దృశ్యాన్ని నెట్టింట్లో చూసి మెగా ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. అయితే చిన్న నిరుత్సాహం ఏంటంటే.. ఈ పోటోలో కూడా క్లింకార ముఖాన్ని కనిపించకుండా దాచారు. మెగా వారసలురాలుపుట్టి ఆరు నెలలుదాటుతున్నా..ఇంకా ఆమె ముఖం చూపించకపోవడంతో.. ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు.
ఇక ఈసీన్ అంతా మెగావారింట జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కనిపించింది. అయితే ఈ వేడుకలను మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసి సెలబ్రేట్ చేశాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యామిలీలు క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహారెడ్డి ఇలా మెగా కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. కాని ఈ వేడుకల్లో పెద్దవాళ్లెవరు కనిపించలేదు.
ఈ సెలబ్రేషన్స్ లో చరణ్, ఉపాసనల ముద్దుల తనయ క్లీంకార స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ కూతురుతో దిగిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. 'బెస్ట్ డాడ్' అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక ఈ వేడుకలతో మెగా..అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు లేవని.. అంతా ఒకటే ఫ్యామిలీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయ్యింది. అంతే కాదు.. ఈ వేడుకల్లో రామ్ చరణ్ , అల్లు అర్జున్ కలిసి క్లోజ్ గా కనిపించారు.
