వెనక్కి లాగకండి... విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ఉపాసన కామెంట్స్!
హీరో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. నూతన రాజకీయ పార్టీ ప్రకటించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ఉపాసన కొణిదెల ఆసక్తికర కామెంట్స్ చేసింది.
హీరో విజయ్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. విజయ్ స్థాపించిన పార్టీ పేరు తమిజగ వెట్రి కజగం. కొన్నాళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి రావడం కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని పలువురు సమర్థిస్తున్నారు. అదే సమయంలో కొందరు విమర్శలు చేస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల స్పందించారు. ఆమె విజయ్ కి తన మద్దతు ప్రకటించారు. విజయ్ కోట్ల మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు. గతంలో కూడా కొందరు సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న లీడర్స్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. వాళ్ళను మనం ప్రోత్సహించాలి కానీ వెనక్కి లాగకూడదు. విజయ్ మంచి రాజకీయ నాయకుడు అవుతాడని నాకు నమ్మకం ఉంది... అని ఉపాసన అన్నారు.
ఇంకా ఆమెకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ఉపాసన వెల్లడించారు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పేరుతో పార్టీ స్థాపించారు. మామయ్య చిరంజీవి గతంలో పీఆర్పీ పేరుతో పార్టీ స్థాపించారు. కొన్ని కారణాలతో పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.