టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ కోసం రామ్ చరణ్ 200కోట్లకు పైగా ఖర్చు చేశాడు. సురేందర్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ బాధ్యతల్ని భార్యకు అప్పగించినట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే రామ్ చరణ్ RRR షూటింగ్ లో చాలా బిజిగా ఉన్నాడు. గతంలో గాయాల కారణంగా షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు గ్యాప్ ఇవ్వకూడదని దర్శకుడు రాజమౌళి చెప్పడంతో చరణ్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. దీంతో సైరా ప్రమోషన్స్ పై ఆ ఎఫెక్ట్ పడకూడదని నెల ముందే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తే బావుంటుందని సురేందర్ రెడ్డితో చెప్పి ఉంచాడు. 

అక్టోబర్ 2న తెలుగులోనే కాకుండా హిందీ - తమిళ్ లో కూడా సైరాఅ సినిమా రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి ఒక్కడివల్ల మూడు భాషల్లో ప్రమోషన్స్ చేయడం సాధ్యం కాదని భార్య ఉపాసనకు ప్రమోషన్స్ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలుస్తోంది. 

తన బిజినెస్ మైండ్ తో కోలీవుడ్ - బాలీవుడ్ ఏరియాలో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యేలా ఉపాసన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 200కోట్ల ఖరీదైన ఈ సినిమా బిజినెస్ బావుండాలంటే ముందుగానే ప్రమోషన్స్ లో ఏ మాత్రం రాజీపడకూడదు, మరి ఉపాసన ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.