రామ్ చరణ్ ఇంట్లో ఎన్టీఆర్, ఉపాసన పండగ సంతోషం

upasana made Christmas tree at home
Highlights

  • కొణిదెెల వారి కోడలిగా వన్నెతెచ్చిన కామినేని ఉపాసన
  • క్రిస్ మస్ సంబరాల్లో భాగంగా విస్తరాకులతో ఉపాసన క్రిస్ మస్ ట్రీ
  • బయో ఫ్రెండ్లీ అంటూ విస్తరాకులతో అందమైన క్రిస్ మస్ ట్రీ
  • ఎన్టీఆర్, శర్వానంద్, సందీప్ వంగలతో పిక్స్ షేర్ చేసిన ఉపాసన

టాలీవుడ్ లో బాక్సాఫీస్ వార్ లో తలపడే హీరోలు మల్టీ స్టారర్ లతో హిట్ కాంబోగా మారి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా రాజమౌళి కాంబినేషన్ లో..ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మూవీ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్స్ కాంబో మధ్య స్నేహం ఇటీవల మరింత బలపడుతోంది. తాజాగా ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ మరోసారి కలిశారు. అధి కూడా రామ్‌చరణ్‌ నివాసంలో... చెర్రీ ఉపాసన కలిసి ప్రీ క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు.

 

చరణ్ సతీమణి ఉపాసన ఈసారి స్వయంగా విస్తరాకులతో క్రిస్మస్‌ చెట్టును తయారు చేశారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ కుటుంబం కూడా హాజరైంది. ఆయనతో పాటు యువ కథానాయకుడు శర్వానంద్‌, ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ క్రిస్మస్‌ చెట్టును విస్తరాకులతో నేనే తయారు చేశా. మిస్టర్‌ ‘సి’తో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టగలరా?’ అంటూ ఉపాసన సంతోషంతో ట్వీట్‌ చేశారు.

 

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘రంగస్థలం’ చిత్రంలో బిజీగా ఉన్నారు. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన రామ్‌చరణ్‌ ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వస్తోంది. మరోపక్క ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ రెండు చిత్రాలూ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తాయి. రాజమౌళి దర్శకత్వంలో వీరిద్దరూ ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ నేపథ్యంలో కథ సాగుతుందని ఫిలింనగర్‌ వర్గాల సమాచారం.

 

loader