Asianet News TeluguAsianet News Telugu

ఉపాసన డ్రెస్ కాస్ట్.. చూడటానికి సింపుల్ గానే ఉన్నా.. అంత ఖరీదా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా వార్తలో నిలిచారు. ఎందుకో కాదు.. ఆమె ధరించిన డ్రెస్ కాస్ట్ వేలల్లో ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Upasana Konidela Dress cost goesViral NSK
Author
First Published Sep 11, 2023, 6:06 PM IST

మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidela)  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వేడుకల్లోనూ రామ్ చరణ్ తో కలిసి మెరవడంతో రామ్ చరణ్ సతీమణిగా తెలిసింది. అప్పటికే అపోలో వైస్ ప్రెసిడెంట్ గా ఉపాసన ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఉపాసన తాజాగా వార్తల్లో నిలిచారు. 

ఇందుకు కారణం.. ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు వల్లే. రీసెంట్ గా రామ్ చరణ్ - ఉపాసన పారిస్ టూర్ కు బయల్దేరిన విషయం తెలిసిందే. దాంతో ఎయిర్ పోర్టులో మీడియా కంటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ఉపాసన డ్రెసింగ్ స్టైల్ కు ఫిదా అయ్యారు.  ఆమె ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతుంటుందని ఆరాతీశారు. 

చూడటానికి సింపుల్ గా ఉన్నా.. ఆ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.42,000 ఉంటుందంటున్నారు. క్యాజువల్ లుక్ లో కనిపిస్తున్న ఆ దుస్తులకే అంత ఖరీదు ఉంటే.. ఇక ప్రత్యేక కార్యక్రమాలు, ఫంక్షన్ల సమయంలో ఉపాసన ధరించే దుస్తుల ధర ఎంత ఉండి ఉంటుందని ఆశ్చర్యపోతున్నారు. ఇక పండంటి బిడ్డ క్లీంకారకు జన్మనిచ్చిన తర్వాత రామ్ చరణ్, ఉపాసన మొదటి సారిగా పారిస్ కు వెళ్లడం విశేషం. 

రామ్ చరణ్  చివరిగా ‘ఆర్ఆర్ఆర్’తో అలరించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు. ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. దీంతో ఆయన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి.  నెక్ట్స్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే బుచ్చిబాబు సానాతోనూ ఆర్సీ16లో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios