గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సమిట్ లో పాల్గొనేందు హైదరాబాద్ వచ్చిన ఇవాంక సదస్సులో ఇవాంక సరసన  మెగా కోడలు ఉపాసన ఇవాంకతో సెల్ఫీ తీసుకుని చెర్రీకి సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన

జీఈఎస్2017 సదస్సు కోసం భారత పర్యటనలో ఉన్న ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ హెచ్ ఐసీసీలో జరుగుతున్న సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇవాంకతో మెగా కోడలు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసనా కామినేని సెల్ఫీ దిగారు.

సదస్సుకు ఉపాసన, నారా బ్రాహ్మణి, మంచు లక్ష్మి లాంటి తెలుగు సినీ పరిశ్రమ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా హాజరైన విషయం తెలిసిందే. ఈ సదస్సులో తాను ఇవాంకా ట్రంప్ వెనుక కూర్చొని ఉన్న క్లిప్పింగ్‌ని తన మామయ్య చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లు తనకు పంపినట్లుగా ఉపాసన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

ఇవాంకా వెనుక తాను కూర్చుని ఉన్న క్లిప్‌ని పోస్ట్ చేసి.. "మా మామయ్య, మిస్టర్ సిలు టీవీలో నేను కనిపిస్తున్న ఈ క్లిప్‌ని పంపించారు. పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలని నమ్ముతున్న వారికి ధన్యవాదాలు’’ అంటూ ఉపాసన హర్షం వ్యక్తం చేశారు.

ఇక ఉపాసన కూడా ఇవాంకతో సెల్ఫీ దిగి పోస్ట్ చేసి.. ఆమె ముద్దుల మిస్టర్ సీకి సర్ ప్రైజ్ ఇచ్చారు.

Scroll to load tweet…