రామ్‌చరణ్‌ లాంటి వ్యక్తి తనకు భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పింది ఉపాసన. తాజాగా ఆమె అపోలో ఆసుపత్రిలో చిన్న పిల్లల కోసం ఉచిత విభాగాన్ని ప్రారంభించారు.

తాను ప్రెగ్నెంట్‌ సమయంలో రామ్‌చరణ్‌ దగ్గరుండి చూసుకున్నాడని, చాలా కేర్‌ తీసుకున్నారని, అలాంటి భర్త దొరకడం తన అదృష్టమని తెలిపింది ఉపాసన. తాజాగా ఆమె సింగిల్‌ మదర్స్ కి ఉచితంగా చిల్డ్రన్ విభాగాన్ని ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్‌లోని అపోలో విభాగంలో ఆమె నేడు దీన్ని ప్రారంభించారు. ఈ మేరకు చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగోని ఆవిష్కరించారు. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉపాసన సేవలందిస్తున్న విషయం తెలిసిందే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ, ‘నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న స‌మ‌యంలో అంద‌రూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించ‌టంతో పాటు ఆశీర్వాదాల‌ను అందించారు. నా ప్రెగ్నెన్సీ జ‌ర్నీని అద్భుత‌మైన జ్ఞాప‌కంగా చేసిన అంద‌రికీ ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలియ‌చేస్తున్నాను. అపోలో పీడియాట్రిక్‌, అపోలో చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తీ త‌ల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. బిడ్డ‌కు ఏదైనా అనారోగ్యం క‌లిగిన‌ప్పుడు త‌ల్లిదండ్రులు ఎంతో బాధ‌ప‌డ‌తారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అంతే ఉండ‌దు. అలాంటి మ‌ధుర క్ష‌ణాల‌ను త‌ల్లిదండ్రుల‌కు అందిస్తోన్న డాక్ట‌ర్స్‌కు ధ‌న్య‌వాదాలు. 

నా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చాలా మంది న‌న్ను క‌లిసి వారి స‌ల‌హాల‌ను ఇచ్చేవారు. అయితే కొందరి మ‌హిళ‌లకు ఇలాంటి స‌పోర్ట్ దొర‌క‌దు. ఆ విష‌యం నాకు తెలిసి బాధ‌వేసింది. మ‌రీ ముఖ్యంగా సింగిల్ మ‌ద‌ర్స్‌కు ఇలాంటి విష‌యాల్లో స‌పోర్ట్ పెద్ద‌గా ఉండ‌దు. నాకు నన్ను బాగా చూసుకునే భర్త ఉన్నాడు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలి, కానీ సింగిల్‌ మదర్స్ నిఎవరు చూసుకుంటారు? కాబ‌ట్టి అపోలో వైస్ చైర్‌ప‌ర్స‌న్‌గా నేను ఓ ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మ‌ద‌ర్ పిల్ల‌ల‌కు ఉచితంగా ఓపీడీ చికిత్స‌ను అందించ‌బోతున్నాం. ఇలాంటి ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీలో నేను వారికి నా వంతు స‌పోర్ట్ అందించ‌టానికి సిద్ధం. ఈ ప్ర‌క‌ట‌న చేయ‌టానికి గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంద‌ని భావిస్తున్నా` అని వెల్లడించింది ఉపాసన. 

ఇక రామ్‌చరణ్‌, ఉపాసన ఇటీవల పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి క్లీంకార కొణిదెల అనే పేరుని నామకరణం చేశారు. 21రోజులు వేడుక గ్రాండ్‌గా చేశారు. పుట్టుకతోనే స్టార్‌ స్టేటస్‌ని పొందిన ఆ చిన్నారి జననం ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారడం విశేషం. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో రామ్‌చరణ్‌ ఇండియా దాటి గ్లోబల్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యారు. గ్లోబల్‌ స్టార్‌గా పేరుని తెచ్చుకున్నారు. దీంతో నేషనల్‌ మీడియా అటెన్షన్‌ ఇటు వైపు మళ్లింది. అలా ఉపాసన డెలివరీ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారానికి కారణమయ్యింది. 

ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` సినిమా చేస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. కేవలం పాటల కోసమే సుమారు 90కోట్లు ఖర్చు చేశారని సమాచారం. మరోవైపు ఈసినిమాకి చరణ్‌కి వంద కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు భోగట్టా. దిల్‌రాజు నిర్మించే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. ఇందులో చరణ్‌ రెండు భిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్‌గా కనిపిస్తారని సమాచారం.