మరోసారి తన గారాల కూతురు ముఖం చూపించకుండా.. ఫ్యాన్స్ ను నిరాశపరిచింది మెగా కోడలు ఉపాసన. ఈరోజు మొదటి సారి తన కూతురుతో కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. 

రామ్ చరణ్, ఉపాసన పెళైన 11 ఏళ్ల గ్యాప్ తరువాత రీసెంట్ గానే తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి తెలిసిందే. మెగా వారసురాలికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ వారసురాలితో ఇటు నాయనమ్మ-తాతయ్యలు సురేఖ- మెగాస్టార్ చిరంజీవి అటు అమ్మమ్మ-తాతయ్య శోభన-అనిల్ కామినేని దిల్ ఖుష్ అవుతున్నారు. తమ సమయాన్ని మనవరాలితో సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు రామ్ చరణ్ కూడా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి మరీ.. కూతురితో సమయం గడిపాడు. ఈమధ్యనే చరణ్ షూటింగ్స్ లో జాయిన్ అయ్యాడు. 

ఇక ఈమధ్య అప్పుడప్పుడు క్లింకారా ఫోటోలతో.. తాము సెలబ్రేట్ చేసుకున్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అగస్ట్ 15న జెండా వందనం చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజుల మెగాస్టార్ తో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. కాని ఈ ఫోటోలలో క్లింకార ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మెగా ఫ్యామిలీ.. అంతే కాదు ఇంత వరకూ ఫ్యాన్స్ కోసం క్లింకార ఫేస్ ను రివిల్ చేయలేదు. ఇక తాజాగా ఉపాసన శ్రవణ మాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. తన గారాల కూతురు క్లింకారతో ఫస్ట్ వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ఆమె.. ఆ ఫోటోను.. సోషల్ మీడియాలో శేర్ చేసుకుంది. అంతే కాదు ఈ సారి కూడా క్లింకార ఫోటో కలనిపించకుండా జాగ్రత పడింది. ఓ ఎమ్మోజీని ఆమె ఫేస్ కు అడ్డంగా పెట్టి.. ఆ ఫోటోను శేర్ చేసింది. 

Scroll to load tweet…

మెగావారింటి గారాల పట్టి క్లింకార. ఇక ఈ పోటోతో పాటు ఉపాసన ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కాని ఉపాసన కాని.. మెగా ఫ్యామిలీ ఎవరూ.. ఇంత వరకూ.. క్లీంకార పేస్ ని రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఫొటోల్లో క్లీంకార పేస్ కొంచమే కనిపిస్తుంది. ఆ కొంచెం కనిపిస్తే చాలు అంటూ.. పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ అంతే కాదు లవ్ సింబల్స్ తో కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు.