మెగా ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది.. రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన. ఇప్పటికే తల్లి కాబోతూ.. చిరంజీవి కుటుంబంలో సంతోషాలు నింపిన ఉపాసన.. ప్రస్తుతంమరో ఘనత సాధించి గ్రేట్ అనిపించుకుంటుంది. 

రామ్ చరణ్ సతీమణిగా.. మెగా కోడలుగా తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ.. అటు ప్రోఫిషన్ లో కూడా తనకు తానే సాటి అనిపించుకుంటుంది ఉపాసన. ఫ్యాషన్ ను ఫాలో అవుతూ.. రామ్ చరణ్ కు తగిన భార్యగా.. తన వెంటే ఉంటూ.. ప్రొత్సహిస్తున్న ఈమె.. అటు తన సొంత బిజినెస్ లను కూడా కుటుంబ బాధ్యతలతో బ్యాలన్స్ చేస్తూ.. వస్తోంది. ఇక రామ్ చరణ్ తో పెళ్లైన 13 సంవత్సరాల తరువాత తల్లి కాబోతోంది ఉపాసన. 

ఎంతో కాలంగా వారసుడి కోసం ఎదురుచూస్తోన్న మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త ఇది. దాంతో అంతా సంబరాలు చేసుకుంటున్నవేళ.. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం.. సంబరాలను రెట్టింపు చేసింది. ఈ విషయంలో ఉపాసన వల్ల తాను ఎంతో లక్కీగామారానని రామ్ చరణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఆ ఆనందాలు ఇంకా పెంచుతూ.. రీసెంట్ గా ఉపాసన మెగా ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ అదేంటంటే..?

అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలిగా.. అపోలో ఫాండేషన్ వైస్ చైర్​పర్సన్​గా.. బిజీ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఉపాసన. మెడికల్ ఫీల్డ్ లో.. తనదైన మార్గంలో సేవచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన. ఎన్నో మెడికల్ క్యాంపులు, వైద్య సేవలు చేయించి.. మరెన్నో సేవా కార్యక్రమాల ద్వార అమె గుర్తింపు పొందారు. ఇక ఉపాసన చేసిన సేవలకు గుర్తింపుగా ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నారు మెగా కోడలు. ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసన చోటు దక్కించుకున్నారు.

Scroll to load tweet…

ఉపాసన చేసిన సేవలకు గానూ ఈ పురస్కారం లభించిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు మెగా కోడలు. ఇక ఉపాసన సాధించిన ఈ అరుదైన ఘనత గురించి తెలిసి మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే ఉపాసన ఆరోనెల ప్రెగ్నెంట్ ఉండటం.. అటు రామ్ చరణ్ ఆస్కార్ విజయం.. సంబరాలలో మునిగితేలుతున్న మెగా ఫ్యామిలీకి..మెగా ఫ్యాన్స్ కు ఈ న్యూస్ మరింత బూస్ట్ ఇచ్చింది. దాంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాలను అంటుతున్నాయి. అటు ఇండస్ట్రీ నుంచి.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఉపాసన కొనిదెల పై ప్రశంసల జల్లు కురుస్తోంది.