అన్ స్టాపబుల్ సీజన్ 3కి రంగం సిద్దం, ముచ్చటగా మూడోసారి సైన్ చేసిన బాలయ్య..?
గెట్ రెడీ ఫ్యాన్స్.. అన్ స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తోంది. అది కూడా బాలయ్య హోస్టింగ్ లో.. మరి ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది.. ఈ వార్తల్లో నిజం ఎంత ..?

రెండు సీజన్లు.. దుమ్ము రేపే రెస్పాన్స్ తో.. దూసుకుపోయింది అన్ స్టాపబుల్.. టాక్ షోలలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందీ షో. బాలయ్యను ఫస్ట్ టైమ్ హోస్ట్ గా చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఆహా ఓటీటీ వేదికపై ఇప్పటివరకూ రెండు విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుని.. సూపర్ హిట్ టాక్ షో గా మారిపోయింది అన్ స్టాపబుల్. అంతే కాదు సక్సెస్ ఫుల్ అవ్వడంతో పాటు.. ఎంతో మంది సెలబ్రిటీలు మనసు విప్పి మాట్లాడేలా చేసింది.
ఇక ఈ సక్సెస్ ఫుల్ షో ఇప్పుడు మూడో సీజన్ కు సన్నద్ధమవుతోంది. అన్ స్టాపబుల్-3కి సంబంధించి తొలి ఎపిసోడ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ ను దసరా సందర్భంగా స్క్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. కాగా, అన్ స్టాపబుల్ కార్యక్రమానికి తన మాటల చాతుర్యంతో విశేష ఆదరణ తెచ్చిపెట్టిన బాలకృష్ణ మూడో సీజన్ కు కూడా హోస్ట్ గా వచ్చేందుకు ఓకే చెప్పాడట. ఇప్పటికే సైన్ కూడా చేశాడని అంటున్నారు.
అంతే కాదు ఈసారి బాలయ్య కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తారని ప్రచారం జరుగుతోంది. అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సినిమా వాళ్ల వరకే పరిమితం చేసినా.. సెకండ్ సీజన్ లో.. కాస్త రాజకీయాలు కూడా ఆడ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సీజన్లలో బాలయ్య తనదైన శైలిలో రాజకీయ నేతలతో పాటు.. మరింత గా ఆడ్ చేయడం కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. , బాలయ్య సూటిగా అడిగే ప్రశ్నలను, చమత్కారాలను వీక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. దానికి ఇప్పటి వరకూ వచ్చిన రేటింగ్స్ నిదర్శనం. ఇక అన్ స్టాపబుల్ ఈసారి కూడా సూపర్ రేటింగ్ తో దూసుకుపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.