సీనియర్‌ నటి గౌతమి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి హంగామా చేశాడు. బాగా తాగి ఉన్న ఆ వ్యక్తి కాసేపు భయాందోళనకు గురి చేశారు. తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో గౌతమి ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, అతన్ని అరెస్ట్ చేశారు. మరింతకు ఎవరు ఆ అపరుచిత వ్యక్తి, గౌతమి ఇంట్లోకి ఎందుకు వచ్చాడనేది పోలీసులు ఆరా తీయగా, ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

ఆ వ్యక్తి పేరు పాండియన్‌. గౌతమి ఇంట్లోకి ప్రవేశించి అనుమానాస్పదంగా తిరగడంతో అందులో పనిచేసే సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ సమయంలో అతను బాగా మద్యం సేవించి ఉన్నాడు. అయితే గోడ పక్కన దాక్కుని ఆందోళన కలిగించాడు. దీంతో పోలీసులు పాండియన్‌ని అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా గౌతమి ఇంట్లోకి ప్రవేశించడంతో అతనిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాండియన్‌ అనే వ్యక్తి సోదరుడు గౌతమి ఉండే ఇంటికి సమీపంలో ఉంటాడని, అతన్ని కలిసేందుకు వచ్చాడని, మద్యం మత్తులో ఆ ఇంటికి వెళ్లబోయి గౌతమి ఇంట్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అరెస్ట్ చేసిన అనంతరం పాండియన్‌ బెయిల్‌ పై విడుదలయ్యాడు. 

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన గౌతమి కొన్నాళ్ళపాటు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌తో సహజీవనం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు సపరేట్‌గా ఉంటున్నారు.