Asianet News TeluguAsianet News Telugu

ఫ్లోలో ఒకే ఒక జీవితం కథ లీక్ చేసిన శర్వానంద్... సబ్జెక్టు అదిరింది, కాకపోతే!

శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. మాటల్లో మాటగా ఆయన ఈ మూవీ కథ లీక్ చేసేశాడు. ఇంతకీ ఒకే ఒక జీవితం కథ విషయంలో ఆయన ఇచ్చిన హింట్ ఏమిటో చూద్దాం...

unknowingly hero sharwanand leaks oke oak jeevitham story
Author
First Published Aug 28, 2022, 1:42 PM IST

చాలా రోజుల తర్వాత శర్వానంద్ మీడియా ముందుకు వచ్చాడు. వరుస పరాజయాలకు తోడు శర్వానంద్ బరువు పెరిగాడట. సన్నిహితులు హెచ్చరించడంతో సన్నబడ్డారట. ఇక తాను ఎంచుకునే సబ్జక్ట్స్ గురించి ప్రస్తావన వచ్చింది. ఆ టాపిక్ గురించి మాట్లాడే క్రమంలో శర్వానంద్ తన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం కథపై హింట్ ఇచ్చాడు. ఒకే ఒక జీవితం మూవీ చేయడానికి కారణం మదర్ లవ్ అండ్ సెంటిమెంట్. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్.  తల్లి ప్రేమను మించింది మరొకటి ఉండదు. ఈ మూవీ సబ్జెక్టు అదే. అలాగే ఇలాంటి కథల్లో నిజాయితీ ఉండాలి. 

దర్శకుడు శ్రీ కార్తీక్ ని ఈ కథ ఎలా రాశావ్ అని అడిగినప్పుడు ఆయన.. మా అమ్మగారు చనిపోయి ఐదేళ్లు అవుతుంది. ఆమెను మరలా కలవాలనిపించేది. అది ఎలా సాధ్యం అని ఆలోచించే క్రమంలో ఈ ఆలోచన వచ్చింది. ఓ టైం మిషన్ ఉంటే నేను గతంలోకి వెళ్ళవచ్చు, అమ్మను కాపాడుకోవచ్చు అనిపించింది. అలా పుట్టిందే ఒకే ఒక జీవితం కథ, అని చెప్పాడట. 

డైరెక్టర్ మాటల్ని బట్టి ఒకే ఒక జీవితం మూవీలో శర్వానంద్ తల్లిగారు అమల చనిపోతారు. తాను అత్యంత ప్రేమించే తల్లిని కలవడం కోసం మిత్రుల సహాయంతో శర్వా గతంలోకి వెళతాడు. మరి తాను అనుకున్నట్లు టైం మెషిన్ సహాయంతో తల్లిని కాపాడగలిగాడా? భవిష్యత్ లో ఆమె బ్రతికి ఉండేలా చేయగలిగాడా? లేదా? అనేది ఈ మూవీ సంఘర్షణగా చెప్పవచ్చు. అనుకోకుండా శర్వా పూర్తి కథపై హింట్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్టు బాగున్నా... కొన్ని హాలీవుడ్ మూవీ పోలికలు కలిగి ఉంది. 

డ్రీం వారియర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక రోల్స్ చేస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జాక్స్ బిజాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మూవీ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అయినా శర్వా హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం. 

Follow Us:
Download App:
  • android
  • ios