టాలీవుడ్ లో ఫారెన్ హీరోయిన్ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ లో బ్రిటీష్ స్టార్ నటించగా.. ఇప్పుడు ఉక్రేయిన్ హీరోయిన్ మరో తెలుగు సినిమాలో నటించబోతోంది.
టాలీవుడ్ లో ఫారెన్ హీరోయిన్ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ లో బ్రిటీష్ స్టార్ నటించగా.. ఇప్పుడు ఉక్రేయిన్ హీరోయిన్ మరో తెలుగు సినిమాలో నటించబోతోంది.
తెలుగు తెరపై హాలీవుడ్ స్టార్స్ సందడి అంతకంతకు పెరిగిపోతుంది. పక్కా రాష్ట్రాల నుంచే కాకుండా.. పక్క దేశాల నుంచి కూడా నటీనటులను తీసుకుంటున్నారు మన మేకర్స్. ఇప్పటిక కొంత మంది తెలుగు సినిమాల్లో సందడి చేశార.. చేస్తున్నారు. ఇప్పుడు మరో ఫారెన్ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఉక్రేయిన్ నుంచి వచ్చిన ఆమె.. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్న తమిళ హీరో శివకార్తికేయన్ తో కలిసి నటిచబోతోంది.
జాతిరత్నాలు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ తదుపరి ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమాలో తమిళ యంగ్ హీరో.. కోలీవుడ్ నేచురల్ స్టార్ గా ఫేమస్ అయిన శివకార్తికేయన్ నటిస్తున్నారు. ఇది శివకార్తికేయన్ కు 20వ సినిమా అవ్వడం విశేషం. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ భామ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్న తెలియజేస్తూ.. మూవీ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెట్స్ పై ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సెట్స్ లోకి వెల్కం చెపుతూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. ఉక్రెయిన్ కు చెందిన మరియా ర్యాబోషప్కా ఇటీవల ఓ ఇండియన్ వెబ్ సిరీస్ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
అటు శివకార్తికేయన్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మన తెలుగులో నానీ మధిరిగానే శివకార్తికేయన్ కు కూడా తిమళంలో మంచి పేరు ఉంది. పక్కింటి కుర్రాడిలా నేచురల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే శివకార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
