తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన తెలంగాణా పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం 'ఉద్యమసింహం'. 

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన తెలంగాణా పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం 'ఉద్యమసింహం'. నటరాజన్, మాధవీరెడ్డి, జలగం సుదీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గతేడాది నవంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా మార్చి 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ విడుదల కాలేదు. దీనికి గల కారణాలను చిత్రనిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరావు వెల్లడించారు. కొందరు తమ సినిమా విడుదల కాకుండా సమస్యలు కలిగిస్తున్నారని, డిస్ట్రిబ్యూటర్లను, సినిమా థియేటర్ యజమానులను సినిమా విడుదల చేయొద్దని బెదిరిస్తున్నట్లు చెప్పారు.

వారెవరికీ భయపడకుండా యూట్యూబ్ లో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. యూట్యూబ్ లో కాపీ రైట్ సమస్య లేదని, ఎవరైనా అప్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.