ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : దిరైజ్’ చిత్రానికి రెండే ళ్లు పూర్తయాయ్యి. బన్నీ - సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే... పుష్పరాజ్ కొల్లగొట్టిన అవార్డులు, బ్రేక్ చేసిన రికార్డులను తెలుసుకుందాం. 

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో మూడోసారి వచ్చిన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ (Pushpa The Rise) . 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా ఈ చిత్రం విడుదలై నేటికి రెండు సంవత్సరాలు గడించింది. అయినా ఇంకా మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ను అభిమానులు, ఆడియెన్స్ మరిచిపోలేదు. పైగా పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక ‘పుష్ప : ది రైజ్’ క్రియేట్ చేసిన సెన్సేషన్, అందుకున్న అవార్డుల వివరాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. ఈ చిత్రానికి సంబంధించి కలెక్షన్లు. సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్స్, డైలాగ్స్, అవార్డుల డిటేయిల్స్ ను మేకర్స్ మరోసారి ఆడియెన్స్ తో పంచుకున్నారు. 

- చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు సాధించింది. హయ్యేస్ట్ టాప్ 10 గ్రాసింగ్ ఫిల్మ్స్ లో చోటుదక్కించుుంది.
- ఇండియాలో రూ.108 కోట్లు నెట్ సాధించింది. 
- మొట్టమొదటిగా ఆల్బస్ కు 6 బిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.
- ఇంటియన్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు దక్కింది.
- 10 మిలియన్లకు పైగా ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ఉన్నాయి
- 7 ఫిల్మ్ ఫేయిర్ అవార్డ్స్
- 7 సాక్షి అవార్డ్స్
- 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సొంతం చేసుకుంది.
- ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును పొందిన ఏకైక తెలుగు హీరోగా అల్లుఅర్జున్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశారు.
- 2002 ప్రైమ్ లో అత్యధిక వ్యూజ్ ను దక్కించుకున్న ఇండియన్ మూవీ
- 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్
- 2022లో తెలుగు వెర్షన్ కు హయ్యేస్ట్ టీఆర్పీ కూడా దక్కింది.

ఇక నెక్ట్స్ Pushpa 2 The Rule కోసం అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈసారి మరింత గ్రాండ్ గా ఉండేలా చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీన్లలోనూ అంతే కిక్క్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్రంలో జగపతి బాబు, రష్మిక మందన్న, అనసూయ, సునిల్, ఫహద్ ఫాజిల్, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 ఆగస్టు 15కు ప్రపంప వ్యాప్తంగా విడుదల కాబోతోంది.