Asianet News TeluguAsianet News Telugu

Two Souls Movie Review: `టూ సోల్స్` మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

కొత్త దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వస్తున్నారు. అందులో భాగంగా కొత్త దర్శకుడు శ్రవణ్‌ రూపొందించిన చిత్రం `టూ సోల్స్`. లవ్‌, ఆత్మల నేపథ్యంలో ఎమోషనల్స్  ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ వారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

two souls movie review rating
Author
First Published Apr 22, 2023, 3:36 PM IST

కొత్త దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వస్తున్నారు. తమ క్రియేటివిటీని చాటుకుంటూ చిత్ర పరిశ్రమని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇటీవల అన్ని చిత్ర పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. నూతన దర్శకులు డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. థియేటర్లలో, ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు. అందులో భాగంగా కొత్త దర్శకుడు శ్రవణ్‌ రూపొందించిన చిత్రం `టూ సోల్స్`. లవ్‌, ఆత్మల నేపథ్యంలో ఎమోషనల్స్  ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ వారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథః 
అఖిల్‌(త్రినాథ్‌ వర్మ) తల్లి చనిపోతుంది. తండ్రి అంటే నచ్చదు. దీంతో దూరంగా సిక్కింలో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆయనకు ప్రియా అనే లవర్‌ ఉంటుంది. ఆమెకి తన ప్రేమని వ్యక్తం చేసి, మ్యారేజ్‌ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం చెప్పేందుకు ఇంటికెళ్లగా, కాలేజ్‌కి వెళ్లిందని చెబుతారు. ఫోన్‌ చేస్తే లిఫ్ట్ చేయదు, ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్టేట్‌ అవుతున్న సమయంలో ఆమె మరో అబ్బాయితో కలిసి కనిపిస్తుంది. దీంతో తాను మోసపోయానని తెలుసుకుని బాధపడతాడు. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆమెని చంపేందుకు బయలు దేరి ఆ పని చేయలేక ఆగిపోతాడు. ఇక తానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అందుకు సిక్కింలోని పెద్ద లోయలో పడిపోయేలా తన కారులో బయలు దేరతాడు. కట్‌ చేస్తే అతను ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఐసీయూలో కొట్టుమిట్టాడుతుంటాడు. అపస్మారక స్థితిలో ఉంటాడు. కానీ తన ఆత్మ మాత్రం బయట తిరుగుతుంది. తనలాగే యాక్సిడెంట్‌ అయిన ప్రియా(భావన సాగి) అనే మరో అమ్మాయి ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉంటుంది. ఆమె ఆత్మ బయట కూర్చొని ఉంటుంది. అనుకోకుండా అఖిల్‌ ఆత్మ ఆ అమ్మాయిని చూస్తుంది. కాసేపు ఈ రెండు ఆత్మలు సైట్‌ కొట్టుకుంటాయి. ఆ తర్వాత తాము ఆత్మలమని ఇద్దరూ తెలుసుకుని ఫ్రెండ్స్ గా మారి తమ గతాలను చెప్పుకుంటారు. వీరి జర్నీ ప్రేమ వరకు వెళ్లుంది. మరి ఆత్మల ప్రేమ నెరవేరిందా? అసలు వీరి గతం ఏంటి? వీళ్లిద్దరు ప్రేమించిన వాళ్లు ఎవరు? ప్రియాకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? మరి అపస్మారక స్థితిలో ఉన్న ఈ ఇద్దరు కోలుకుని తిరిగి వారి ఆత్మలను పొందారా? లేక చనిపోయారా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. 

విశ్లేషణః 
`టూ సోల్స్` అనేది రెండు ఆత్మల ప్రేమ కథ. యాక్సిడెంట్‌తో ఆసుపత్రిలో పడి ఉన్న అమ్మాయి, అబ్బాయి ఆత్మలు కలుసుకోవడం, తమ గతాలను చెప్పుకోవడం, ఫ్రెండ్స్ గా మారి, ప్రేమ వరకు వెళ్లడమనేది ఓ కొత్త కాన్సెప్ట్. ఈ ఐడియా సూపర్‌గా ఉంది. ఇది ఈ సినిమాకి కొత్త దనాన్ని తీసుకొచ్చింది. మరోవైపు సిక్కిం లాంటి అందమైన ప్రాంతంలో జరిగే ప్రేమ కథ కావడంతో వీరి ప్రేమ కథతో పాటు, అక్కడి అందాలు అబ్బురపరుస్తుంటాయి. కనువిందు చేస్తాయి. ఓ వైపు మంచు, మరోవైపు కూల్‌గా సాగే ప్రేమ కథ ఆహ్లాదాన్ని పంచేలా ఉంటుంది. దర్శకుడికిది తొలి చిత్రమైనా బాగా డీల్‌ చేశాడు.

అయితే మొదటి భాగం సినిమా చాలా స్లోగా సాగుతుంది. హీరో తన ప్రియురాలు మోసం చేయడం వల్ల తను పడే సంఘర్షణ, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, అనూహ్యంగా చనిపోకుండా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటం, అలాగే మరో అమ్మాయి కూడా యాక్సిడెంట్‌ కారణంగా అదే ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండి, ఆత్మగా మారి, హీరోకి పరిచయం కావడమనేది కొత్తగా, డిఫరెంట్‌గా, ఊహించని విధంగా ఉంది. వీరిద్దరు ప్రేమలో పడటానికి ముందు ఈ ఇద్దరు ట్రావెల్‌ చేస్తూ తమ గతాన్ని రివీల్‌ చేసుకుంటూ వెళ్లిన తీరు ఆకట్టుకుంది. అయితే సినిమా మొత్తం స్లోగా సాగుతుంది. కథ ఎంత సేపు అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. కథలో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. ఆయా పాత్రలు తీరుతెన్నులు కూడా ఓవర్‌గా అనిపిస్తుంటాయి. మొదటి భాగం మొత్తం ఏం జరుగుతుందో అర్థం కాదు. అంతా చిరాకు తెప్పిస్తుంది. దీంతో కన్‌ ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతూ బోర్‌ తెప్పిస్తుంది. హీరో పాత్ర తన గతాన్ని చెప్పేటప్పుడు ఆయా సీన్లు చూపించాల్సి ఉంది. ఎంత సేపు వాళ్లిద్దరే మాట్లాడుకోవడం చిరాకుపెట్టే అంశం. అయితే సినిమాలో ఎంటర్‌టైనర్‌ అస్సలు లేదు, అదే పెద్ద మైనస్‌.

స్టాఫ్‌ జర్నీ మొత్తం సెకండాఫ్‌కి లింక్‌ అయి ఉంటుంది. నెమ్మదిగా ఒక్కో అంశం రివీల్‌ అవుతుంటుంది. హీరో ప్రేమించిన ప్రియాకి, యాక్సిడెంట్‌ అయిన ప్రియాకి ఉన్న సంబంధమేంటి? అనేది రివీల్‌ అయ్యే విధంగా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ట్విస్ట్ లు అదిరిపోయాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు సినిమా పరుగులు పెట్టడమే కాదు, భావోద్వేగానికి, ఉత్కంఠకి గురి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. మొదటి భాగంలో కలిగే బోర్‌ ఫీలింగ్‌ని తొలగిస్తుంది. ఫైనల్‌గా వచ్చే ట్విస్ట్ వాహ్‌ అనేలా ఉంటుంది. కన్‌క్లూజన్‌ మాత్రం గుండెని కలచివేస్తుంది. హృదయాన్ని బరువెక్కిస్తుంది. సినిమాలో అండర్‌లైన్‌గా సాగే ఎమోషన్స్ క్లైమాక్స్ లో పీక్‌లోకి వెళ్తుంది. అదే ఈ సినిమాకి ప్రధాన బలం, హైలైట్‌ పాయింగ్‌గా చెప్పొచ్చు. 

నటీనటులుః 

అఖిల్‌ పాత్రలో త్రినాథ్‌ వర్మ బాగా చేశాడు. కొత్త అయినా కథలో ఇన్‌వాల్వ్ అయి పాత్రలో జీవించారు. హీరో అనేలా కాకుండా ఓ సింపుల్‌ కుర్రాడిలా కనిపించాడు. ప్రియాగా కనిపించే పాత్రలో భావన సాగి నటన సైతం ఆకట్టుకుంటుంది. మొదట ఓవర్‌గా అనిపించినా, ఆ తర్వాత ఆ పాత్రనే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అఖిల్‌ ఫ్రెండ్‌ రేవంత్‌గా రవితేజ కుర్రాడు ఫర్వాలేదు. ప్రియా ఫ్రెండ్‌ అసలు ప్రియా పాత్రలో మౌనికా రెడ్డి కాసేపు మెరిసింది. మొత్తంగా త్రినాథ్‌ వర్మ, భావన సాగి ఈ సినిమాని తమ భుజాలపై మోశారు. మెప్పించారు.

టెక్నీషియన్లుః

దర్శకుడు శ్రవణ్‌.. కాన్సెప్ట్, టేకింగ్‌ బాగుంది. ప్రారంభం నుంచి సస్పెన్స్ ని సస్టేయిన్‌ చేస్తూ, ట్విస్ట్ లను దాచి ఫైనల్‌లో రివీల్‌ చేసిన తీరు బాగుంది. కాకపోతే ప్రారంభంలో ఎమోషన్స్ క్యారీ కాలేదు. అందుకే బోర్‌ తెప్పిస్తుంది. గతం చెప్పేటప్పుడు ఆయా సీన్లు చూపిస్తే బాగుండేది. బోర్‌ ఫీల్‌ని తగ్గించేది. ఇంకా హీరోహీరోయిన్ల నుంచి మరింత నటన రాబట్టుకోవాల్సింది. సినిమా నిడివిని కూడా ఇంకా తగ్గిస్తే బోర్ ఫీల్‌ నుంచి రిలీఫ్‌ దొరికేది. వినోదం సైడ్‌ ఫోకస్‌ చేయాల్సింది. కానీ దర్శకుడిగా మొదటి సినిమా అయినా ఫర్వాలేదనిపించాడు. శశాంక్‌ సాయి రామ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీక్ అందించిన బాణీలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఆనంద్ నంబియార్ నేపథ్య సంగీతం మూడ్‌కు తగ్గట్టుగా వెళ్తుంది. `ప్రేమంటే.. ఒకరు మాత్రమే ప్రేమిస్తే సరిపోదు, మనం ఎవరో తెలియాలంటే.. చుట్టు పక్కలా చూడటం కాదు..వెనక్కి చూస్తే తెలుస్తుంది` అంటూ రైటర్‌గా శ్రవణ్ రాసిన కొన్ని మాటలు మెప్పిస్తాయి. రైటర్ గా, ఎడిటర్‌గా దర్శకుడు శ్రవణ్ ఆకట్టుకుంటాడు. విజయ లక్ష్మీ నిర్మాతగా ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌తో నిర్మించినట్టు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating- 2.5
 

Follow Us:
Download App:
  • android
  • ios