. మార్నింగ్ , మ్యాట్నీ షోలకు కేవలం  15% రేంజ్ లో ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఎక్కడా కలెక్షన్స్ పెరగలేదు.   మొత్తం మీద సినిమా మొదటి రోజు భారీగా నిరాశకలిగించే కలెక్షన్స్ ని సాధించి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది.  ఈ క్రమంలో ఎందుకు ఇలా జరిగిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గా మారింది.  


అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసింది. ఒక్కరోజు ముందుగా.. అంటే, ఆంధ్రాలో ఎంపిక చేసిన సెంటర్లలో ప్రీమియర్స్ రూపంలో ప్రేక్షకుల్ని పలకరించేసింది ‘థాంక్యూ’. ఆ టాక్ బాగా స్ప్రెడ్ అవటంతో ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. మార్నింగ్ , మ్యాట్నీ షోలకు 15% రేంజ్ లో ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఎక్కడా కలెక్షన్స్ పెరగలేదు. మొత్తం మీద సినిమా మొదటి రోజు భారీగా నిరాశకలిగించే కలెక్షన్స్ ని సాధించి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎందుకు ఇలా జరిగిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గా మారింది. 

 నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని అందుకుని లాంగ్ రన్ లో ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సక్సెస్ లుగా నిలిచాయి. కానీ ఆ ఇంపాక్ట్ ఏమి కూడా థాంక్యూ సినిమా మీద పడలేదు… సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ ఏర్పడలేదు. దానికి తోడూ రిలీజ్ రోజు వర్షాల ఇంపాక్ట్ కూడా పడింది. దాతో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వరకు కూడా ఏవి లేవు. రీసెంట్ టైమ్ లో నాగ చైతన్య కెరీర్ లోనే లో వరస్ట్ ఓపెనింగ్స్ ఇప్పుడు సినిమా సొంతం చేసుకుంది.

ఇంత దారుణమైన ఓపినింగ్స్ రావటానికి కారణం నిర్మాత,డిస్ట్రబ్యూటర్ గా దిల్ రాజు తీసుకున్న నిర్ణయాలే అంటున్నారు. ఆంధ్రాలో ముందురోజే ప్రీమియర్ షోలు వేయటం దెబ్బ కొట్టిందని చెప్తున్నారు. నెల్లూరులోని ఎస్‌2 సినిమాస్‌, భీమ‌వ‌రంలోని ఏవీజీ సినిమాస్‌, విజ‌య‌వాడ‌లోని క్యాపిట‌ల్ సినిమాస్ తో పాటు వైజాగ్ జ‌గ‌దాంబ థియేట‌ర్‌, రాజ‌మండ్రి శ్యామ‌ల థియేట‌ర్ల‌లో ఈ స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షోస్ వేసారు. సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ...సినిమా సోసోగా ఉందని ప్రస్దావించటం... ఉదయం థియేటర్ కు వెళ్దామనుకువాళ్ళని ఆ టాక్ ఆపేసిందని చెప్తున్నారు. ఇక నైజాంలో టిక్కెట్ రేట్లు తగ్గించకపోవటం సినిమాకు మైనస్ గా మారిందని అంటన్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ చేసిన పొరపాటు సినిమాని దారుణంగా దెబ్బ తీసిందని విశ్లేషిస్తున్నారు. 

దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతోనే నాగ‌చైత‌న్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ దిల్‌రాజు సంస్థ‌లో నాగ‌చైత‌న్య చేసిన సినిమా ఇది. ఇందులో రాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ హీరోయిన్లుగా న‌టించారు.