కోవిడ్ ప్రాణాలు తీయడమే కాకుండా మనుషుల్ని ఇలా దొంగలుగా మార్చుతుంది. కోవిడ్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన చాలా మంది ఆర్టిస్ట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఇలా కొందరు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగలుగా మారుతున్నారు.
తప్పు చేస్తే తప్పించుకోవడం ఈరోజుల్లో అంత ఈజీ కాదు. మూడో కన్ను సీసీ కెమెరా అందరి నేరాలను గమనిస్తూ ఉంటుంది. ఇద్దరు సీరియల్ యాక్ట్రెసెస్ అలాగే దొంగతనం చేసి దొరికిపోయారు. హిందీ సీరియల్స్ సావ్ధాన్ ఇండియా, క్రైమ్ పెట్రోల్ లో నటించిన యాక్టర్స్ సురభి సుందర్‌లాల్ శ్రీవాస్తవ, ముక్తర్ షేక్‌లను దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సురభి, ముక్తర్ రాయల్ పామ్ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్లోలోని ఫ్రెండ్ ఇంటికి పేయింగ్ గెస్ట్‌గా వెళ్లారు. ఈనెల 18న అక్కడే పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న మరో మహిళకు చెందిన 3.28 లక్షల రూపాయలు కనిపించకుండా పోయాయి.
దొంగతనం అనంతరం ఇద్దరు అమ్మాయిలు ఆ ఇంటి నుంచి పరారు అయ్యారు. ఇద్దరిపై అనుమానంతో ఆ మహిళ ఆరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అపార్ట్‌మెంట్ సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా.. మహిళ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. దీంతో పారిపోయిన యాక్టర్స్‌ను పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కాగా తమ విచారణంలో కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.