Asianet News TeluguAsianet News Telugu

రెండు బాలీవుడ్ బడా సంస్థల నుండి నిఖిల్ కి ఆఫర్స్ 


హీరో నిఖిల్ టైం మాములుగా లేదు. ఆయన రేంజ్ ఏకంగా బాలీవుడ్ కి పాకింది. రెండు బడా ప్రొడక్షన్ హౌసెస్ తనకు ఆఫర్స్ ఇచ్చినట్లు వెల్లడించారు. 
 

two big production houses offered me says hero nikhil
Author
First Published Sep 3, 2022, 7:26 PM IST

పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో నిఖిల్ ఒకరు. శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ హ్యాపీ డేస్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన వాళ్లలో అందరూ కనుమరుగయ్యారు. నిఖిల్, తమన్నా మాత్రమే రాణించారు. నిఖిల్ ప్రయాణం మాత్రం చాలా కఠినంగా సాగింది. హిట్స్, ప్లాప్స్, అవమానాలు, బెదిరింపులు ఎన్నో ఎదుర్కొన్నాడు. నిఖిల్ అర్జున్ సురవరం చిత్రం అసలు సంబంధం లేని వాళ్ళ చేతుల్లో చిక్కుకొని విడుదల ఆలస్యం అయ్యింది.  సినిమా విడుదల అవుతుందా...  అనుకుంటుండగా అన్ని ప్రాబ్లెమ్స్ పరిష్కరించి మూవీ విడుదల చేశారు. 

లేటెస్ట్ సెన్సేషన్ కార్తికేయ 2 పరిస్థితి కూడా అదే. రెండు సార్లు విడుదల తేదీలు మార్చారు. బడా బాబుల కోసం కార్తికేయ 2 ని అడ్డుకున్నారన్న వాదన ఉంది. అది నిజం కూడా. లేటైనా కానీ కార్తికేయ 2 చిత్రంతో మరపురాని విజయాన్ని అందుకున్నాడు. కార్తికేయ 2 సౌండ్ ఇండియా వైడ్ వినిపించింది. తెలుగుతో పాటు హిందీలో విడుదల చేయగా రెండు భాషల్లో భారీ విజయాలు నమోదు చేసింది. వరల్డ్ వైడ్ కార్తికేయ 2 రూ. 111 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో రూ. 26 కోట్లకు పైగా నెట్ వసూళ్లు అందుకుంది. 

దర్శకుడు చందూ మొండేటి సైన్స్, మైథాలజీ కలగలిపి అదిరిపోయే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. చందూ మొండేటితో పాటు నిఖిల్ కి బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. కాగా రెండు బడా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ తనకు ఆఫర్స్ ఇచ్చినట్లు నిఖిల్ తెలియజేశాడు. ఈ క్రమంలో ఆ రెండు సంస్థలు ఏవి అనే ఆలోచనలో ఆయన ఫ్యాన్స్ పడ్డారు. మరోవైపు కార్తికేయ 3 ప్రకటించారు. ఈ చిత్రాన్ని మరింత భారీగా నిర్మించనున్నట్లు సమాచారం. కార్తికేయ 2 విడుదలకు ముందే స్పై టైటిల్ తో నిఖిల్ పాన్ ఇండియా మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios