పరారీలో హీరో విజయ్!

Two actors drown, hero Duniya Vijay has a narrow escape
Highlights

దునియా విజయ్ హీరోగా నటించిన 'మాస్తిగుడి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సందర్బంగా జరిగిన

దునియా విజయ్ హీరోగా నటించిన 'మాస్తిగుడి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సందర్బంగా జరిగిన దుర్ఘటనలో ఇద్దరు విలన్లు జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాగరహోళే, దాండేలి తదితర ప్రాంతాల్లో మాస్తిగుడి సినిమా షూటింగ్ చేశారు.

అయితే సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం దాదాపు నెల రోజుల పాటు వేచి చూశారు. చివరికి తిప్పగుండనహళ్ళి దగ్గర క్లైమాక్స్ తీయాలని నిర్ణయించారు.ఆ సమయంలోనే సినిమాలో విలన్లుగా నటించిన అనీల్, ఉదయ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయంలో మాస్తిగుడి నిర్మాత సుందర పి.గౌడను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు హీరో విజయ్.

దీంతో ఆయన్ను అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు పోలీసులు. దీంతో దునియా విజయ్ పరారీ అయ్యాడు. ఆయన్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేకంగా  పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఇది ఇలా ఉండగా.. నిర్మాతకు కొన్ని షరతులతో కోర్టు జామీన్ మంజూరు చేసింది. 

loader