Asianet News TeluguAsianet News Telugu

దావూద్ ఇబ్రహీం పార్టీలో డాన్స్ కు నాకంటే అందగత్తెలే దొరకలేదా? హీరోయిన్ కౌంటర్

``దావూద్ మరింత నైపుణ్యం కలిగిన డ్యాన్స‌ర్ నే ఎన్నుకుంటాడని వార్తా ఛానెల్‌లకు తెలిసి ఉండాలి. కానీ ఇది నకిలీ వార్తల ప్రపంచం`` 

Twinkle Khanna Recalls News Claiming She Performed At Dawood Ibrahim Parties jsp
Author
First Published Apr 22, 2024, 11:46 AM IST

సెలబ్రిటీల గురించి ఆరోపణలు ,రూమర్స్ వస్తూంటే మొదట్లో కంగారుపడేవారు. కానీ   కాలక్రమేణా, వారి వృత్తిలో భాగంగా  తప్పనిసరిగా భావించడం ప్రారంభించారు,  ప్రతి వారం రిలీజయ్యే వారి సినిమాలు, రిలేషన్స్, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు మరియు పబ్లిక్ డొమైన్‌లో మొదట చర్చించకూడని కొన్ని అంశాల గురించి లెక్కలేనన్ని  రూమర్స్ ఇప్పుడు అతి కామన్ అయ్యాయి. అలాగే కొన్ని ప్రమాదకరమైన వార్తలు కూడా పుట్టించటం మొదలెట్టారు. 

 కొన్ని వార్తలు అలా అలా ప్రచారంలోకి వచ్చేస్తూంటాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఆ వార్తలను అవునో కాదో తెలుసుకోకండా కవర్ చేసేస్తుంటుంది. అలాంటి ఓ వార్తపై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఓ ఘాటు సైటర్ వేసింది. అయితే ఓ పదేళ్ల తర్వాత ఆ సెటైర్ వేయటం ఆశ్చర్యం అనిపించింది. వివరాల్లోకి వెళితే...

అప్పట్లో  అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఆయన  పార్టీల్లో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా డ్యాన్సులు చేసిందని  వార్తలు వచ్చాయి. ఆ వార్త వచ్చి దాదాపు పదేళ్ల అయ్యింది. ఇన్నాళ్ల తర్వాత సదరు వార్తలపై స్పందించింది ట్వింకిల్‌. ఇప్పటివరకు లేనిపోనివి ఎన్నో సృష్టించారు. నిరసనల్లో ఉన్న క్రీడాకారులు నవ్వుతున్నట్లుగా మార్ఫింగ్‌ చేశారు. కరోనా పుట్టుక గురించి ఏదేదో ప్రచారం చేశారు. అలాగే నేను దావూద్‌ ఇబ్రహీం పార్టీలో నేను డ్యాన్స్‌ చేశానని రాశారు.

నా డ్యాన్స్‌ స్కిల్స్‌ నా పిల్లలకు బాగా తెలుసు. అయినా దావూద్‌ ఇబ్రహీం నా కన్నా గొప్పవాళ్ళను, అందగత్తెలను,  బాగా పర్ఫామ్‌ చేసేవారిని సెలక్ట్‌ చేసుకుంటాడు. ఆ విషయం టీవీ ఛానల్స్‌ వారికి తెలిసుంటే బాగుండేది. అది కూడా తెలీకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రూమర్ సృష్టించారు అని చెప్పుకొచ్చింది. కాగా అక్షయ్‌ కుమార్‌- ట్వింకిల్‌ ఖన్నా 2001లో పెళ్లి చేసుకున్నారు.
 
 బర్సాత్‌, జబ్‌ ప్యార్‌ కిసిసే హోతా హై, సీను, బాద్‌షా.. ఇలా కొన్ని సినిమాలు చేసిన ఆమె తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. తర్వాత కథల పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. అలా నాలుగు పుస్తకాలు రిలీజ్‌ చేసింది. 

ఇక మందాకిని మొద‌లు అనేక మంది హీరోయిన్స్  దావూద్ తో ప్రేమాయ‌ణం సాగించార‌ని క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. పాపుల‌ర్ తెలుగు హీరోయిన్ దావూద్ కి ప్రియురాలు కావ‌డంతో త‌న కెరీర్ ని కోల్పోయింది. దావూద్ శిష్యుడు అబూస‌లేంతో ప్రేమాయ‌ణం సాగించ‌డ‌మే కాక త‌న కోసం కెరీర్ నే వ‌దులుకుంది శ్రీ‌కాంత్ 'తాజ్‌మ‌హ‌ల్' హీరోయిన్ మోనికా భేడీ.ఈ క‌థ‌ల‌న్నీ అలా ఉంచితే... దావూద్ ఇబ్రహీం కోసం డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారనే పాత ఆరోపణపై ఖిలాడీ అక్ష‌య్ కుమార్ భార్య‌, ప్ర‌ముఖ న‌టి ట్వింకిల్ ఖన్నాపై క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios